హుండీ ఆదాయం లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

హుండీ ఆదాయం లెక్కింపు

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

ఒంటిమిట్ట (రాజంపేట): ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు చేపట్టారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను సిబ్బంది లెక్కించారు. దీని ద్వారా టీటీడీకి రూ.6,93,885 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఏఈవో రవి తెలిపారు.

రైతు మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ

కడప అగ్రికల్చర్‌: శిక్షణ ద్వారా పొందిన జ్ఞానం, నైపుణ్యాలను గ్రామస్థాయిలోని రైతులకు సమర్థవంతంగా బోధించి, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంపొందించడంతో పాటు, జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు రైతు మాస్టర్‌ ట్రైన ర్లు కృషి చేయాలని ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు అధికారి యస్వీ ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ మేనేజ్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ ఆధ్వర్యంలో గురువా రం కడప రైతు మాస్టర్‌ ట్రైనర్లకు మూడు రోజుల రెసిడెన్షియల్‌ ట్రైనింగ్‌ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఎస్‌.వి. ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఇండో జర్మన్‌ గ్లోబర్‌ అకాడమి ఆఫ్‌ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్‌ అండ్‌ లెర్నింగ్‌ వారి సహకారంతో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొదటి రోజు శిక్షణలో భాగంగా ప్రకృతి వ్యవసాయంలోని 9 సార్వత్రిక సూత్రాలను, వాటి వెనుక ఉన్న శాసీ్త్రయతను రైతు మాస్టర్‌ ట్రైనర్లకు వివరించారు.

డ్యూటీ చార్ట్‌ కౌన్సెలింగ్‌

ప్రక్రియపై వివాదం

– పర్యవేక్షణాధికారులు లేకుండానే

నిర్వహిస్తున్నారని కార్మికుల అభ్యంతరం

పులివెందుల రూరల్‌: పులివెందుల ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు, కండక్టర్ల డ్యూటీ చార్ట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై వివాదం నెలకొంది. ఏటా నిర్వహించే ఈ ప్రక్రియను నిబంధనల ప్రకారం సీనియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌, చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షణలో చేపట్టాలి. అయితే, గత కొంతకాలంగా ఈ రెండు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పైగా, కౌన్సెలింగ్‌ ఆదేశాలు జారీ చేసిన ఉద్యోగి సైతం సెలవుపై వెళ్లడంతో ప్రక్రియ నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. పర్యవేక్షణాధికారులు అందుబాటులో లేకుండానే హడావుడిగా కౌన్సెలింగ్‌ చేపడితే భవిష్యత్తులో అక్రమాలు, వివాదాలు తలెత్తే ప్రమాదముందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకు అధికారుల సమక్షంలోనే కౌన్సిలింగ్‌ నిర్వహించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

జామ తోటలను

పరిశీలించిన శాస్త్రవేత్తలు

మైలవరం: మండలంలోని తలమంచిపట్నం గ్రామంలో రైతులు సాగుచేస్తున్న జామ తోటలను కడప ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎన్‌. కృష్ణప్రియ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా జామ తోటల్లో సూక్ష్మ పోషకాలు, జీవ శిలీంధ్రనాశనుల (బయో ఫంగిసైడ్స్‌) వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. మండల వ్యవసాయాధికారి గురుభాస్కర్‌, పాల్గొన్నారు.

సైనికుడికి ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు

కలసపాడు : మండలంలోని మహానందిపల్లె గ్రామానికి చెందిన గడికోట చిన్నఓబయ్య 26 సంవత్సరాలుగా దేశసేవ కోసం సైనికుడిగా పనిచేస్తున్నారు. ఇతను జవాన్‌ జేసీఓగా పనిచేస్తున్నారు. మంగళవారం మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆకస్మికంగా మృతి చెందాడు. గురువారం ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన మహానందిపల్లెలో ఆర్మీ లాంఛనాలతో జరిగా యి. నాసిక్‌కు చెందిన సుబేదార్‌లు సింహాచలం, హరిప్రసాద్‌ మృతదేహాన్ని మహానందిపల్లెకు తీసుకువచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నఓబయ్య భార్య స్వరూప, ఇద్దరు కుమార్తెలను వారు ఓదార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement