దాయి దాయి.. దామ్మా!..అక్టోబరే ఆఖర్‌ లేమ్మా! | - | Sakshi
Sakshi News home page

దాయి దాయి.. దామ్మా!..అక్టోబరే ఆఖర్‌ లేమ్మా!

Aug 24 2026 1:13 AM | Updated on Aug 24 2026 1:13 AM

తపాలా శాఖ జాతీయ లేఖా రచన పోటీలు

విజేతలకు వేలాది రూపాయల బహుమతులు

అక్టోబర్‌ 31 లోపు పోస్ట్‌ చేయాలి

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : సోషల్‌ మీడియా రాకతో ఒకప్పుడు ప్రతి ఇంట్లో సందడి చేసిన ఉత్తరం, నేడు చుట్టపుచూపుగా మారింది. నేటి తరానికి అసలు ఉత్తరం ఊసే తెలియకపోగా, పాత తరం కూడా ఆ జ్ఞాపకాలను మర్చిపోతోంది. ఈ నేపథ్యంలో లేఖల ప్రాధాన్యతను గుర్తు చేసేందుకు భారతీయ తపాలాశాఖ ఏటా దేశవ్యాప్తంగా ‘దాయి ఆఖర్‌’ పేరుతో జాతీయ స్థాయి లేఖారచన పోటీలను నిర్వహిస్తోంది.

ఈ ఏడాది అంశం : ప్రకృతి రక్షణపై అవగాహన కల్పించేందుకు ఈసారి ‘భూమాతకు ఒక లేఖ – ప్రకృతిని రక్షించడానికి నా వాగ్దానం’ అనే అంశాన్ని ఎంపిక చేశారు. ఈ లేఖను తెలుగు, హిందీ, లేదా ఇంగ్లీష్‌ భాషల్లో రాయవచ్చు.

పోటీల నిబంధనలు

వయోపరిమితి : పోటీలను రెండు విభాగాలుగా (18 ఏళ్ల లోపు వారు ఒక కేటగిరీ, 18 ఏళ్లు పైబడిన వారు మరో కేటగిరీగా) నిర్వహిస్తారు.

వయస్సు ధృవీకరణ : జనవరి 1, 2026 నాటికి తమ వయస్సును తెలియజేస్తూ సంబంధిత వయస్సు ధృవీకరణ పత్రాన్ని లేఖతో పాటు జతపరచాలి.

చివరి తేదీ : పూరించిన లేఖలను To, The Chief Postmaster General, Andhra Pradesh Circle, Vijayawada – 520013. చిరునామాకు పంపాల్సి ఉంటుంది.

మన రాష్ట్రానికి చెందినరు, ఎన్వలప్‌ కవరుపైన లేదా ఇన్‌ల్యాండ్‌ లెటర్‌ కార్డు పైన స్పష్టంగా ఈ కింది విధంగా రాయాలి.

టాప్‌ హెడ్డింగ్‌ : ‘DHAI AKHAR LETTER COMPETITION 2026–27‘విభాగం (Category): మీ వయస్సును బట్టి ‘Up to 18 Years‘ లేదా ‘Above 18 Years‘ అని రాయాలి.

ఫార్మాట్‌ : "Envelope Category" (ఏ4 పేపర్‌ అయితే) లేదా "Inland Letter Card Category" అని రాయాలి.

లేఖలో మర్చిపోకూడని ముఖ్యమైన వాక్యం (Age Declaration):నిబంధనల ప్రకారం లేఖ చివర్లో మీ సంతకానికి పైన తప్పనిసరిగా మీ వయస్సును ధృవీకరిస్తూ ఈ కింది వాక్యాన్ని రాయాలి, లేదంటే లేఖ తిరస్కరించబడుతుంది : తెలుగులో: ‘01/01/2026 నాటికి నా వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ లేదా ఎక్కువ అని నేను ధృవీకరిస్తున్నాను.

ఇంగ్లీష్‌లో : "I certify that I am below or above the age of 18 as on 01/01/2026.

చివరి తేదీ గడువు : అక్టోబర్‌ 31 లోపు మీ లేఖను మీ స్థానిక పోస్టాఫీస్‌ డబ్బాలో వేయాలి లేదా రిజిస్టర్‌ పోస్ట్‌ చేయాలి.

లేఖ ఎలా రాయాలి?

ఎన్వలప్‌ కవర్‌ : ఏ4 సైజ్‌ పేపర్‌ పై రాసి, ఎన్వలప్‌ కవర్‌లో పెట్టి పంపేవారు 1000 పదాలకు మించకుండా రాయాలి.

ఇన్‌ల్యాండ్‌ లెటర్‌ : ఇన్‌ల్యాండ్‌ లెటర్‌ కార్డు పై రాసేవారు 50 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది.

నగదు బహుమతుల వివరాలు : ఉత్తమ లేఖలను ఎంపిక చేసి జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కింది విధంగా నగదు బహుమతులు అందజేస్తారు.

బహుమతుల వివరాలు

● జాతీయ స్థాయి ప్రథమ బహుమతి: రూ.50,000

● రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి: రూ. 25,000

● జాతీయస్థాయి ద్వితీయ బహుమతి: రూ.25,000

● రాష్ట్ర స్థాయి ద్వితీయ బహుమతి: రూ.10,000

● జాతీయస్ఠాయి తృతీయ బహుమతి: రూ.10,000

● రాష్ట్ర స్థాయి తృతీయ బహుమతి: రూ. 5,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement