పోలీసుల చొరవతో తల్లి చెంతకు బాలిక | - | Sakshi
Sakshi News home page

పోలీసుల చొరవతో తల్లి చెంతకు బాలిక

Aug 24 2026 1:13 AM | Updated on Aug 24 2026 1:13 AM

ప్రొద్దుటూరు క్రైం : పాఠశాలకు వెళ్లలేదని తల్లి మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన 9 ఏళ్ల బాలికను ప్రొద్దుటూరు టూ టౌన్‌ పోలీసులు గుర్తించి తల్లికి అప్పగించారు. శ్రీనివాసనగర్‌కు చెందిన చెరసాల లక్ష్మి కుమార్తె ప్రశాంతి పాఠశాలకు వెళ్లలేదనే కారణంతో శనివారం తల్లి మందలించింది. దీంతో అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో ప్రశాంతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆందోళనకు గురైన తల్లి ఆదివారం టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వంశీనాఽథ్‌, ఎస్‌ఐ ఆర్‌ రాఘవేంద్రారెడ్డిలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి కేవలం రెండు గంటల్లోనే బాలిక ఆచూకీ గుర్తించారు. బాలికను సురక్షితంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. తన కుమార్తెను గుర్తించి సురక్షితంగా అప్పగించిన టూ టౌన్‌ పోలీసులకు లక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు కనిపించకుండా పోయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీప పోలీస్‌స్టేషన్‌లో లేదా డయల్‌ 112కు సమాచారం అందించాలని సీఐ వంశీనాథ్‌, ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement