రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు హెల్మెట్ ధరించాలనేది నిబంధన. కానీ నేటి తరం యువతకు మాత్రం అది కేవలం ఒక ఫ్యాషన్‌గా, స్టయిల్ స్టేట్‌మెంట్‌గా మారిపోయింది. ఏకంగా హెల్మెట్ రూపురేఖలనే మార్చేస్తూ.. పిల్లి చెవులు, ఎద్దు కొమ్ములు, కార్టూన్ క్యారెక్టర్ల రూపంలో ఉండే వింత వింత హెల్మెట్లతో రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు.తాజాగా ఖాజీపేట రోడ్డుపై ఒక యువకుడు ప్రముఖ యానిమేషన్ క్యారెక్టర్ ‘పికాచు’ ఆకారంలో ఉన్న పసుపు రంగు హెల్మెట్ ధరించి బైక్‌పై వెళ్తూ కెమెరా కంటికి చిక్కాడు. బైక్ రైడర్ వైరెటీ గెటప్‌ను చూసి రోడ్డుపై వెళ్లే వాహనదారులు, బాటసారులు వింతగా చూస్తూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి విచిత్రమైన, నిబంధనలకు విరుద్ధమైన మోడిఫైడ్ హెల్మెట్ల వల్ల తోటి వాహనదారుల దృష్టి మళ్లి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టయిల్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి ఫ్యాషన్ రైడర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– ఖాజీపేట


