పుష్పగిరి గిరి ప్రదక్షిణ లోగో ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పుష్పగిరి గిరి ప్రదక్షిణ లోగో ఆవిష్కరణ

Aug 24 2026 1:13 AM | Updated on Aug 24 2026 1:13 AM

కడప సిటీ : శ్రీ పుష్పగిరి తీర్థ క్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి నాడు పుష్పగిరి గిరి ప్రదక్షిణ నిర్వహించే సమితి సభ్యులకు సంబంధించి లోగోలతో కూడిన టీ షర్టులను ఆవిష్కరించారు. ఆదివారం కడప నగరం ఎర్రముక్కపల్లిలోని శ్రీ జగన్మాత మారెమ్మ దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, న్యాయవాది సట్టి భారవి, రిటైర్డ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు, అమృత ప్యాలెస్‌ లాడ్జి యజమాని శ్రీనివాసులు, శ్రీనివాసమూర్తిలు అతిథిగా విచ్చేశారు. ప్రతి పౌర్ణమి రోజున భక్తులకు సేవ చేస్తున్న సమితి సభ్యులకు గుర్తింపుగా ఈ గిరి ప్రదక్షిణ లోగో కలిగిన టీ షర్ట్స్ఙ్‌ను విడుదల చేసినట్లు తెలిపారు.

నేడు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : జిల్లా వ్యాప్తంగా దళితులు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూతోపాటు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మనోహర్‌, లక్ష్మీదేవి, జిల్లా కోశాధికారి వెంకటసుబ్బయ్య ఒక సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రమ్మ హాజరవుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల దాటిన దళితుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక శంఖారావం పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారని తెలిపారు.

నేడు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌ సభాభవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు డీఆర్వో మల్లికార్జునుడు తెలిపారు. డివిజన్‌, మండల, మున్సిపల్‌ స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో సమర్పించిన అర్జీల వివరాలు తెలుసుకోవడానికి 1100 కాల్‌ సెంటర్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

జిల్లాలో వర్షం

కడప అగ్రికల్చర్‌ : జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. వల్లూరులో 23.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే సిద్దవటంలో 21.6, చెన్నూరులో 19.6, పెద్దముడియంలో 18.4, బి.కోడూరులో 14.8, కమలాపురంలో 13.4, బద్వేల్‌లో 9.8, కొండాపురంలో 8.8, కడపలో 8.4, జమ్మలమడుగు, ఎర్రగుంట్లలలో 6.4, బి.మఠంలో 6, మైలవరంలో 5.6, ఖాజీపేటలో 5.2, కాశినాయనలో 4.2, రాజుపాలెంలో 4, గోపవరంలో 3, మైదుకూరులో 2.6, ఒంటిమిట్టలో 2.2, దువ్వూరులో 1.4 మి.మీ వర్షం కురిసింది.

పోలింగ్‌ కేంద్రాల

ముసాయిదా జాబితా విడుదల

కడప సెవెన్‌రోడ్స్‌ : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆదివారం రాత్రి జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించి కోర్టులోకేసు పెండింగ్‌లో ఉండడం వల్ల మినహాయింపు ఇచ్చారు. మిగతా వివరాలు పరిశీలిస్తే జిల్లాలో 39 మండలాలకుగాను 619 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 6006 వార్డులు ఉన్నాయి. ఇక పోలింగ్‌ కేంద్రాలు 6120 ఉండగా, పురుష ఓటర్లు 5,74,607, మహిళా ఓటర్లు 5,95,706, ఇతరులు 59 మంది వెరసి 11,70,372 మంది ఓటర్లు ఉన్నట్లు నిర్ధారిస్తూ జిల్లా పంచాయతీ అధికారి కె.రామచంద్ర ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన రాష్ట్ర స్థాయిసైకిల్‌ పోలో పోటీలు

ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురంలోనున్న యశోద ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్‌లో జరిగిన ఒకటో ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ బాలబాలికల రాష్ట్రస్థాయి సైకిల్‌ పోలో పోటీలు ఆదివారం ముగి శాయి. బాలుర విభాగంలో మొదటి స్థానం ప్రకా శం,ద్వితీయ స్థానం అనంతపురం, తృతీయ స్థానంలో కడప జిల్లా నిలిచాయి. ఇక బాలికల విభాగంలో మొదటి స్థానం అన్నమయ్య, ద్వితీయ స్థానం సత్యసాయి, తృతీయ స్థానం కడప జిల్లా జట్లు నిలిచాయి. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బాలుర విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన నరేంద్ర, బాలికల విభాగంలో అన్నమయ్య జిల్లాకు చెంది న హర్షిత నిలిచారు. ఎంపికై న క్రీడాకారులు నవంబర్‌లో జోద్పూర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement