ఎమ్మెల్యే సాక్షిగా జాతీయ జెండాకు అవమానం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సాక్షిగా జాతీయ జెండాకు అవమానం

Aug 17 2026 1:29 AM | Updated on Aug 17 2026 1:29 AM

ప్రొద్దుటూరు : ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారుల సాక్షిగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇర్షాన్‌ బాషా తెలిపారు. ఈ నెల 15న స్థానిక అనిబిసెంట్‌ మున్సిపల్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమం వేదిక వద్ద నేలపైనే త్రివర్ణ పతాకం రూపాన్ని ఏర్పాటు చేశారన్నారు. వేదికపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో సహా నాయకులు, అధికారులు, కార్యక్రమ నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ జెండా ఎత్తయిన స్థాయిలో గర్వంగా, హుందాతనంగా రెపరెపలాడాలని, త్రివర్ణ రంగులను నేలపై, ప్రజలు నడిచే ప్రదేశంలో ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌సల్ట్‌ టు నేషనల్‌ హానర్‌ యాక్ట్‌ 1971లోని సెక్షన్‌ 2 ప్రకారం జాతీయ జెండాను తొక్కడం లేదా దానికి ఇతర విధాలుగా అవమానం చేయడం శిక్షార్హమని ఆయన గుర్తు చేశారు. ఈ చట్టంలో జాతీయ జెండా చిత్రం, పెయింటింగ్‌, డ్రాయింగ్‌ లేదా ఇతర కనిపించే ప్రతిరూపం కూడా ప్రస్తావించబడిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై మున్సిపల్‌ అధికారులు, కార్యక్రమ నిర్వాహకులు స్పష్టమైన వివరణ ఇవ్వాలని, భవిష్యత్తులో జాతీయ జెండా గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement