కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–19 మెన్ మల్టీ డే ఇంటర్‌జోనల్ మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్‌ల్లో తొలి రోజు ఆదివారం కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టీమ్–ఈ వర్సెస్ టీమ్–బీ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన టీమ్–ఈ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 74.2 ఓవర్లకు 339 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి గణేష్ 96 పరుగులు చేశారు. టీమ్–బీ జట్టులోని శ్రీరామ్ వీరేంద్ర అవినాష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్–బీ జట్టు 13 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. టీమ్–ఈ జట్టులోని తేజసాయి 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో..
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమ్–డీ వర్సెస్ టీమ్–ఏ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన టీమ్–డీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్–డీ జట్టు 64.4 ఓవర్లకు 302 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మనుదర్శన్ 81 పరుగులు చేశారు. టీమ్–ఏ జట్టులోని తులసి నందన్ 4 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్–ఏ జట్టు 25 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. దీంతో తొలిరోజు ఆట ముగిసింది.


