నూతన ఆవిష్కరణలకు వేదిక ‘స్టార్ట్‌ అప్‌ కడప’ | - | Sakshi
Sakshi News home page

నూతన ఆవిష్కరణలకు వేదిక ‘స్టార్ట్‌ అప్‌ కడప’

Jul 21 2026 12:23 AM | Updated on Jul 21 2026 12:23 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదికగా ‘స్టార్ట్‌ అప్‌ కడప‘ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ నిలుస్తుందని కలెక్టర్‌ శ్రీధర్‌ అన్నారు. స్టార్ట్‌ ఆప్‌ కడప సెంటర్‌ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోందని ఆయన వెల్లడించారు. సోమవారం సాయంత్రం సబ్‌ కలెక్టర్‌ హెచ్‌.ఎస్‌. భావనతో కలిసి పూర్తి కావచ్చిన నిర్మాణ పనులను పరిశీలించారు. భవనం బాహ్య నిర్మాణ పనులను వారంలోపు పూర్తి చేసి, వెంటనే అంతర్గత సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్ట్‌అప్‌ ఆవిర్భవించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ‘స్టార్ట్‌ అప్‌ కడప‘ రూపుదిద్దుకుంటోందన్నారు. ఈ కేంద్రం ద్వారా స్టార్ట్‌అప్‌ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు అవసరమైన మార్గదర్శకత్వం, ఆధునిక సదుపాయాలు, ప్రోత్సాహం లభిస్తాయని తెలిపారు. కేఎంసీ కమిషనర్‌ భవానీ ప్రసాద్‌, హౌసింగ్‌ ఇంజనీర్లు, ఏడీపీ యంగ్‌ ప్రొఫెషనల్స్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement