కొనసాగుతున్న అండర్‌–19 క్రికెట్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న అండర్‌–19 క్రికెట్‌ పోటీలు

Jul 21 2026 12:23 AM | Updated on Jul 21 2026 12:23 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 మెన్‌ మల్టీడే మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి, సోమవారం రెండోరోజు వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో 355 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇ న్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 96.1 ఓవర్లలో 378 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఎస్‌ఎంజి ప్రభాకర్‌ 43 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని సంజయ్‌ కుమార్‌ 4, కిరణ్‌కుమార్‌ 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించి న అనంతపురం జట్టు 81 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. జట్టులోని భువనేశ్వర్‌ 36, కౌశిక్‌ 42 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని మంజునాఽథ్‌ 3, తేజేష్‌ 2 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 195 పరుగుల వెనుకంజలో ఉంది.

కెఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో...

కెఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో 21 పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 45.2 ఓవర్లలో 161 పరుగులు చేసింది. జట్టులోని సూర్యతేజ్‌రెడ్డి 36, ధీరజ్‌కుమార్‌రెడ్డి 34 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని జితేస్‌ వర్దన్‌ 5 వికెట్లు తీశాడు. సాయి విఘ్నేష్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 45 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఆజట్టులోని రోహిత్‌ గౌడ్‌ 37, సాయి విఘ్నేష్‌ 45 పరుగులు చేశారు. కడప జట్టులోని ధీరజ్‌కుమార్‌ రెడ్డి చక్కటి లైనఫ్‌తో బౌలింగ్‌ చేసి 4 వికెట్లు తీశాడు. దీంతో కర్నూలు జట్టు 228 పరుగులు మందంజలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement