దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్‌ | - | Sakshi
Sakshi News home page

దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్‌

Jul 21 2026 12:23 AM | Updated on Jul 21 2026 12:23 AM

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖను ప్రైవేటీకరణ చేస్తూ జారీ చేసిన 396 జీవోను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుంటి వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం రాష్ట్ర సంఘం పిలుపుమేరకు కడప అర్బన్‌ రూరల్‌ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాల వద్ద సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖ సేవలతో పాటు కక్షిదారుల సొంత వ్యవహారమైన దస్తావేజుల తయారీ విధానాన్ని కూడా రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెం.396 ను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు నిరవధిక పెన్‌ డౌన్‌ (సమ్మె) చేస్తున్నారని వివరించారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, దస్తావేజు లేఖరుల, స్టాంపులు వెండర్ల, టీడీపీ ఆపరేటర్లు, లేఖరుల సహాయకుల జీవనోపాధిని కాపాడాలని కోరారు. దస్తావేజులేఖరుల లైసెన్సులు పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న సమ్మెకు క్రయవిక్రయదారులు, జిల్లా ప్రజానీకం, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. కాగా దస్తావేజు లేఖరుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు స్తంభించాయి. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నగర అధ్యక్షులు సంజీవరాయుడు, నగర నాయకులు సి. నాగరాజు, ఎస్‌ ఎండీ ఇక్బాల్‌, బి.ఓబుల కొండయ్య, కే.ఓబులేసు, జే.రామకష్ణ, వై.సుబ్బరాయుడు, రామకష్ణారెడ్డి, టి. లోకనాథం, హరి, ఓ రమణ ఐ. సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద

నిరాహార దీక్షలు

రిజిస్ట్రేషన్‌ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

స్తంభించిన రిజిస్ట్రేషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement