జనం గొంతుకగా జగన్‌ యాప్‌ | - | Sakshi
Sakshi News home page

జనం గొంతుకగా జగన్‌ యాప్‌

Jul 19 2026 1:26 AM | Updated on Jul 19 2026 1:26 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : సామాన్య ప్రజలు సైతం తమ గొంతుకను వినిపించడానికి తద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ రూపొందించినట్లు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం కడప నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన యాప్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లా డుతూ ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త, సానుభూతి పరులు సూపర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ బాధితులు, దగాపడ్డ ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, మహిళా వర్గాలు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నించేవారిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేసి తిప్పుతున్నారని విమర్శించారు. ప్రస్తుత కూటమి పాలన చూస్తుంటే హిట్లర్‌, బ్రిటీషువారే నయమనేపించే విధంగా ఉందన్నారు. వాయిస్‌లెస్‌ పీపుల్‌ తమ గొంతుకను వినిపించేందుకు జగన్‌ సూపర్‌యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. నిజాలు మాత్రమే యాప్‌లోకి అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. కాగా కూటమి ప్రభుత్వం చేస్తామన్న హామీలు చేయలేదని దుమ్మెత్తిపోశారు. కనీసం కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వలేని దౌర్బగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ప్రజలు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షులకు ఏవైనా చెప్పదలుచుకుంటే చెప్పే అవకాశం కల్పించామన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్‌ పాకా సురేష్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

పి.రవీంద్రనాథరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement