ఎన్నాళ్లకొచ్చావే వాన! | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకొచ్చావే వాన!

Jul 19 2026 1:26 AM | Updated on Jul 19 2026 1:26 AM

కడప అగ్రికల్చర్‌ : ఎల్‌నినో కరవు రక్కసి మధ్య అన్నదాతలకు వరుణుడు స్వల్ప ఊరటనిచ్చాడు. దాదాపు 30 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత శనివారం తెల్లవారుజామున జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన ఉపశమన వర్షం.. ఎండల తీవ్రత, పొడి గాలుల వల్ల వాడుముఖం పట్టిన ఆరుతడి, ప్రకృతి సాగు పంటలకు కొత్త జీవాన్ని పోసింది.

జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని మండలాల్లోనే ఈ వర్షం కురిసింది. అత్యధికంగా మైదుకూరులో 56 మి.మీ నమోదు కాగా మైదుకూరు 56.0 , ఖాజీపేట 42.6 , ప్రొద్దుటూరు 39.4, నందలూరు 35.4, ఎర్రగుంట్ల: 29.0, రాజంపేట 23.8, కమలాపురం 23.2, సీకే దిన్నె 20.6, కడప 18.4, దువ్వూరు 16.6 , చెన్నూరు 16.2, వల్లూరు, వీరబల్లి 15.6, ఒంటిమిట్ట 15.4 సిద్దవటం 13.2 , చాపాడు 11.2, టి. సుండుపల్లి 9.2, పోరుమామిళ్ల 6.4, అట్లూరు, కొండాపురం 6.2 , పెద్దముడియం, ముద్దనూరు 4.2, సింహాద్రిపురం, రాజుపాలెం: 3.4 ,వేంపల్లె: 3.2, వీఎన్‌పల్లి: 0.2

ప్రకృతి, బహుధాన్య సాగుకు వరం : జిల్లావ్యాప్తంగా సాగైన సుమారు 10 వేల ఎకరాల వేరుశనగ, పత్తి, మినుము, మొక్కజొన్న, జొన్న పంటలకు ఈ తడి ఎంతో మేలు చేసింది.

మనల్ని ఎవడ్రా ఆపేది

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : అధికారమే ఆయుధంగా జిల్లాలో టీడీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దాదాపు 16 ఏళ్లుగా ఓ వృద్ధుడు ఉంటున్న ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించేందుకు కడపకు చెందిన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బొజ్జాతిరుమలేష్‌ తన అనుచరగణంతో శనివారం యత్నించారు. వివరాల్లోకి వెళితే మున్సిపాలిటీ పరిధిలోని గౌరీశంకర్‌నగర్‌లో గల 1021 సర్వే నంబరులో గల 74 ప్లాట్‌లో పిన్నంవెంకటయ్య అనే వృద్ధుడు గత 16 ఏళ్లుగా ఇంటిని నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రొద్దుటూరులోని వసంతపేటకు చెందిన కొందరు వ్యక్తులు వచ్చి ఈ స్థలం మాది అని, ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ దౌర్జన్యానికి దిగారు. అప్పట్లో స్థానిక మహిళలు గట్టిగా వారించడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. తిరిగి శనివారం ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తుల నుంచి ఓ అగ్రిమెంటు రాయించుకున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్‌ తన అనుచరగణంతో సమ్మెటలు, గడ్డపారలు తీసుకొచ్చి ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీగోడను పడగొట్టారు. దాదాపు అరగంట సేపు బీభత్సం సృష్టించారు. ఇంతలో చుట్టుపక్కల మహిళలు స్పందించి అతని దౌర్జన్యంపై నిలదీశారు. ఇంతలో బాధితుడు కూడా 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో దౌర్జన్యానికి పాల్పడిన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత, అతని అనుచరులు అక్కడ నుండి పారిపోయారు. ఘటనపై పోలీసుస్టేషన్‌లో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు.

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడి దౌర్జన్యం

ఓ వృద్ధుడి ఇంటిని ఆక్రమించేందుకు యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement