● కింది కోర్టు రివ్యూ ఉత్తర్వుల సవాల్‌కు సుప్రీం అనుమతి
● గతంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును కొట్టివేసిన ఏపీ హైకోర్టు
లింగాలలో రెండు తలల పాము
లింగాల : వైఎస్సార్ కడప జిల్లాలోని మండల కేంద్రమైన లింగాలలోని అల్లీ పీరా అనే రైతు పొలంలో మంగళవారం అరుదైన రెండు తలల పాము కనిపించింది. దీన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల పొలాల్లోని రైతులు తరలి వచ్చారు. ఇలాంటి రెండు తలల పాము ఇదే మొదటి సారిగా కనిపించిందని రైతు తెలిపాడు. గతంలో రెండు తలల పాము పట్టి ఇస్తే అధిక డబ్బులు ఇస్తామని ప్రచారాలు సాగాయి. అయితే రైతులు దాన్ని చంపివేయడం జరిగింది. ఈ పాము సామాన్యంగా కరవదని, కరిస్తే ఈ పాము విష ప్రభావంతో మనుషుల ప్రాణాలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని రైతులు తెలిపారు. ఇలాంటి పాములు ఎక్కడ ఇంతవరకు కనిపించలేదని, ప్రస్తుతం ఈ పాము కనిపించిందని, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని రైతులు భయాందోళన చెందుతున్నారు.
యువకుడి ఆత్మహత్య
వేంపల్లె : స్థానిక పులివెందుల రోడ్డులో ఉన్న హెయిర్ కటింగ్ సెలూన్ షా పులో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని నూతన కాల్వ శశివర్ధన్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చక్రాయ పేట మండలం కె.రాజుపల్లెకు చెందిన నూతన కాల్వ రెడ్డెప్ప జయమ్మ దంపతుల కుమారుడు శశివర్ధన్ వేంపల్లెలోని శివశంకర్ హెయిర్ కటింగ్ షె లూన్ షాపులో పని చేసేవాడు. తండ్రి రెడ్డెప్ప రెండేళ్లక్రితం మృతి చెందాడు. తల్లి జయమ్మ కూలి పనులు చేసుకునేది. ఈ క్రమంలో మంగళవారం షెలూన్ కటింగ్ షాపు యజమాని శివశంకర్ మధ్యాహ్నం ఇంటికి వెళుతూ సాయంత్రం షాపును మూసి వేసి ఇంటికి వెళ్లమని చెప్పి మృతుడి చేతికి తాళాలు ఇచ్చాడు. సాయంత్రం షాపులో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేకున్నాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో తల్లి జయమ్మ కుమారుడు ఫోన్ ఎత్తక పోవడంతో షాపు యజమానికి ఫోన్ చేసి తన బిడ్డ ఇంటికి రాలేదని అడిగింది. దీంతో శివశంకర్ షాపు వద్దకు వచ్చి చూడగా శశివర్ధన్ ఉరి వేససుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు జయమ్మతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా తన చావుకు ఎవరూ కారకులు కారు అని లేఖ మృతుడి జేబులో చిక్కిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోష్టు మార్టం నిమిత్తం వేంపల్లెలోని ప్రభుత్వ అసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు.
ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని అమృతానగర్‌కు చెందిన మైనర్‌బాలిక ను అపహరించి అత్యాచారానికి పాల్పడిన పచ్చిపాలు కార్తీక్ ఆచారిని అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ నాగభూషణ్ తెలిపారు. ఈనెల 12న బాలిక వాంగ్మూ లం ఆధారంగా అతనిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు. ఈ క్రమంలో నిందితుడు మడూరు రోడ్డులో ఉండగా మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు. నేరానికి ఉపయోగించిన బైక్‌ను అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన లింగాల రామలింగారెడ్డి అలియాస్ వేల్పుల రాము దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. కింది కోర్టు ఇచ్చిన రివ్యూ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తగిన పిటిషన్ దాఖలు చేసేందుకు ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రామలింగారెడ్డి మధ్య నడుస్తున్న ఈ వివాదానికి సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టు కోర్టులో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్ ల ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టులో దాఖలైన రివ్యూ పిటిషన్ పరిష్కారమైందని ధర్మాసనం దష్టికి తెచ్చారు. అయితే, వివాదాస్పద ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో) అన్వయంపై ఆ రివ్యూ ఆర్డర్‌లో న్యాయస్థానం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. సింగిల్ జడ్జి లేదా డివిజన్ బెంచ్ ఉత్తర్వుల ప్రభావం లేకుండా, కేవలం వాస్తవాల ఆధారంగా అధికారులే మళ్లీ పరిశీలించుకోవాలని చెబుతూ రివ్యూను ముగించారని, ఇది కేసు మెరిట్స్ ఆధారంగా జరగలేదని న్యాయవాది వాదించారు.
ఈ వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ.. కింది కోర్టు ఇచ్చిన రివ్యూ ఉత్తర్వుల పట్ల అసంతప్తిగా ఉంటే వాటిని సవాల్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. ఆ ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సంబంధించి తగిన పిటిషన్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని న్యాయవాది కోరారు. పిటిషనర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. రివ్యూ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ వేసేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే...:
గతంలో లింగాల రామలింగారెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ పులివెందుల పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. సబ్–ఇన్‌స్పెక్టర్ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టు విచారణకు స్వీకరించింది. దీన్ని సవాల్ చేస్తూ రామలింగారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 195 ప్రకారం, ఐపీసీ సెక్షన్లు 172 నుంచి 188 వరకు ఉన్న నేరాలపై సంబంధిత అధికారి లేదా కోర్టు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, పోలీసులు నేరుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం చెల్లదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. పోలీసుల చర్యను తప్పుబడుతూ రామలింగారెడ్డిపై నమోదైన కేసును కొట్టివేస్తూ గతంలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.


