సింహాద్రిపురం : మండలంలోని బిదినంచర్ల గ్రా మంలో మంగళవారం సాయంత్రం రైతు ఎన్.నా గేశ్వరరెడ్డి చీని తోటకు నిప్పు అంటుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తనకున్న 2 ఎకరాల పొలంలో తొమ్మిదేళ్ల చీనీచెట్లకు కాపు బాగావచ్చింది. కొన్ని రోజుల్లో కాయలు విక్రయించి మంచి ఆదాయం వస్తుందన్న రైతు ఆశలు ఆడియాశలయ్యాయి. మంగళవారం సాయంత్రం రైతు నాగేశ్వరరెడ్డి తన తోట వద్దకు వెళ్లి చూడగా అప్పటికే చీనీ తోటలో మంటలు పూర్తిగా వ్యాపించాయి. తోటకు అమర్చిన డిప్పు పరికరాలు, మంచి దిగుబడి ఉన్న చీనీచెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన ట్రాక్టర్ల స్పేయర్లతో మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే రైతుకు జరగాల్సిన నష్టం జరిగింది. ఈ విషయాన్ని ఎస్‌ఐ డాక్టర్ నాయక్‌కు బాధిత రైతు తెలిపాడు. ఈ తోటలో అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా.. లేదా ఆకతాయిలు చేశారనేది తెలియాల్సి ఉంది. నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పలువులు రైతులు కోరుతున్నారు.
ఇద్దరు విద్యార్థులు అదృశ్యం
జమ్మలమడుగు రూరల్ : మండలంలోని మోరగు డి గ్రామానికి చెందిన దినకర్ మరో విద్యార్థి ప్ర సాద్ స్నేహితులు. వీరు జమ్మలమడుగు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం పాఠశాలకు వెలుతున్నామని చెప్పిన వీరు పాఠశాలకు వెళ్లకుండా సోమవారం సాయంత్రం కూడా ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు మంగళవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఇద్ద రు విద్యార్థులు తిరుపతిలో ఉన్నట్లు వారు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.


