టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి 20 కుటుంబాలు
పోరుమామిళ్ల : మండలంలోని కవలకుంట్ల దళితవాడలో టీడీపీ నుంచి 20 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు నాగార్జునరెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి సమక్షంలో ఆదివారం రాత్రి వారు పార్టీలో చేరారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, వైస్ ఎంపీపీ రాజశేఖర్, వైద్యవిభాగం సెక్రటరి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు. పార్టీలో చేరినవారిలో వీరపోగు జోజి, మరియమ్మ, గురవయ్య, ప్రసాద్, రవిచంద్ర, పుష్పరాజ్, రవి, ఫాతిమా, రోజమ్మ, అబ్బయ్య, చందు, శంకర్, నారిపోగు రవి, మేరమ్మ, అశోకరాణి, నిర్మలాదేవి, అజయ్, విజయభాస్కర్, యేసు, చిట్టిబాబు, రూతమ్మ, శంకర్, సునీల్, సరిత, నీలిమ తదితరులు ఉన్నారు.


