తిరుపతి–హిస్సార్ రైలు పొడిగింపు
కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి–హిస్సార్ మధ్య కడప మీదుగా నడుస్తున్న రైలు ఫిబ్రవరి 11వ తేది వరకు పొడిగించినట్లు కడప రైల్వే కమర్షి యల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. 07717 నెంబరుగల రైలు ప్రతి బుధవారం తిరుపతిలో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, డోన్, కర్నూలు, మహబూబ్‌నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, పూర్ణ, అఖోల, సూరత్, వడోదర, మదార్, సిఖార్, సాగుల్‌పూర్‌ల మీదుగా హిస్సార్‌కు చేరుతుందన్నారు. 07718 నెంబరుగల రైలు ప్రతి ఆదివారం రాత్రి 11.15 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఫిబ్రవరి 15వ తేది వరకు ఈ రైలును పొడిగించామన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
పీలేరు: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిండమే లక్ష్యమని ఏపీఎస్‌పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) శివశంకర్ అన్నారు. మంగళవారం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని గూడరేవుపల్లె పంచాయతీ పుట్టావాండ్లపల్లె పర్యటించి విద్యుత్ వినియోగంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. టాప్ సోలార్ ప్లాంట్లు, డిజిటల్ మీటర్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయం, కనెక్షన్లు సమస్యలు, బిల్లుల వివాదాలు, విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణ, డిజిటల్ చెల్లింపులు వంటి అంశాలపై ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్బంగా 14 సమస్యలుగుర్తించి పరిష్కార మార్గం చూపినట్లు తెలిపారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్ధేశిత గ్రామాలు, పట్టణాల్లో పరిశీలన కార్యక్రమం చేపట్టాలని కోరారు. వినియోగదారులు తమ సమస్యలపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ సీఎం 8977716661 నెంబర్‌కు కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, డీఈఈ అమీర్‌బాషా, రూరల్ ఏఈ రామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి–హిస్సార్ రైలు పొడిగింపు


