Ýë…MóS-†MýS ç³Ç-gêq¯]l… ò³…´÷…¨…^èl$MøÐéÍ️ | - | Sakshi
Sakshi News home page

Ýë…MóS-†MýS ç³Ç-gêq¯]l… ò³…´÷…¨…^èl$MøÐéÍ️

Dec 24 2025 4:11 AM | Updated on Dec 24 2025 4:11 AM

Ýë…MóS-†MýS ç³Ç-gêq¯]l… ò³…´÷…¨…^èl$MøÐéÍ️

Ýë…MóS-†MýS ç³Ç-gêq¯]l… ò³…´÷…¨…^èl$MøÐéÍ️

కడప అర్బన్‌ : పోలీస్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటూ మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పేర్కొన్నారు. మంగళవారం కడప నగరంలోని పెన్నార్‌ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో పోలీ స్‌ సిబ్బందికి ఐటీ ఆధారిత అప్లికేషన్ల నైపుణ్యాలు పెంపొందించే రిఫ్రెషర్‌ కోర్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎ స్పీ మాట్లాడుతూ సీసీటీఎన్‌ఎస్‌, సీడీఆర్‌ ఎనాలిసిస్‌, టవర్‌ డంప్‌ ఎనాలిసిస్‌, ఏపీ–కాప్స్‌, ఈ–సాక్ష్య, తదితర సాంకేతికపరమైన దర్యాప్తు నైపుణ్యాలపై పట్టు సాధించాలన్నారు. ఎన్‌.సి.ఆర్‌.పి పోర్టల్‌, మీ సేవా పోర్టల్‌, పి.జి.ఆర్‌.ఎస్‌ పోర్టల్‌ లలో ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకునేలా నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.మధుమల్లేశ్వర రెడ్డి, ఐ.టి కోర్‌ టీమ్‌ సిబ్బంది, జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ షెల్కే

నచికేత్‌ విశ్వనాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement