స్మార్ట్‌ కిచెన్‌ షెడ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ కిచెన్‌ షెడ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష

Dec 24 2025 4:11 AM | Updated on Dec 24 2025 4:11 AM

స్మార్ట్‌ కిచెన్‌ షెడ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష

స్మార్ట్‌ కిచెన్‌ షెడ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి సమీక్షించారు. మంగళవా రం కలెక్టరేట్‌ బోర్డు మీ టింగ్‌ హాల్‌ నుంచి మధ్యా హ్న భోజన పథకంలో భాగంగా అందిస్తున్న ఆహారం తయారీలో నాణ్యమైన రుచి, పారిశుద్ధ్య మెరుగుపై అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్‌ కిచెన్‌ షెడ్ల నిర్మాణ పురోగతిపై నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులతో ఆరా తీశారు.

మహిళా సాధికారతకు చక్కటి వేదిక ఆర్తీ విలేజ్‌

మహిళా సాధికారత సాధనకు, బాలికల విద్య, నైపుణ్య సామర్థ్యాల పెంపునకు చక్కటి వేదికగా నిలిచిన ఆర్తీ ఫౌండేషన్‌ సేవలు ప్రశంసనీయమని కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. ఆర్తి హోమ్‌ (ఆర్తీ విలేజ్‌) ప్రాంగణాన్ని మంగళవారం కలెక్టర్‌ సందర్శించి హోం పనితీరును పరిశీలించారు. సంస్థ వ్యవస్థాపకురాలు పుచ్చలపల్లి సంధ్య సంస్థ ఆర్తీ ఫౌండేషన్‌ ప్రగతిని కలెక్టర్‌ కు వివరించారు.

అనుమతులు లేకుండా ఇసుక అక్రమ తరలింపు: కలెక్టర్‌కు సర్పంచ్‌ ఫిర్యాదు

ఇసుక రీచ్‌కు ఎలాంటి అనుమతులు లేకున్నా 15 నెలల నుంచి పాపాగ్ని నది నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోందని చక్రాయపేట మండలం కుమారకాల్వ సర్పంచ్‌ కె.శీధర్‌రెడ్డి మంగళవారం కలెక్టర్‌ శ్రీధర్‌కి ఫిర్యాదు చేశారు. పాపాగ్ని నదిలో సుమారు 1400 మీటర్ల పొడవున 300 మీటర్ల వెడల్పుతో 15 అడుగుల లోతులో సుమారు 20 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను అక్రమంగా టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారన్నారు. ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement