అంబా అని అరిచినా...
9 నెలలుగా రాని మందులు
పశు పోషకుల ఇంటి ముంగిటే మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ సేవలు సైతం అంతంత మాత్రంగానే అందుతున్నాయని.. సంచార వాహనం ఒక ఊరికే పరిమితం చేస్తున్నారని పలువురు పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలకించరేమయ్యా..!
కడప అగ్రికల్చర్: మూగజీవాల సంరక్షణ చర్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. పశు వైద్యశాలకు మందుల సరఫరాను పూర్తిగా అటకెక్కించింది. ఫలితంగా మందుల కోసం పశు యజమానులు ప్రైవేటు షాపులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక జీవాల చెంతకే వచ్చి వైద్య సేవలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోంది. దీంతో మూగ జీవాల వేదన అరణ్య రోదనగా మారింది.
జిల్లావ్యాప్తంగా...
జిల్లావ్యాప్తంగా 79 గ్రామీణ పశు వైద్యశాలలు, 78 పశు వైద్యశాలలు , 17 ప్రాంతీయ పశు వైద్యశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆవులు, ఎద్దులు, ఎనుములు కలిసి 4,44,460 ఉండగా, 9,83,684 గొర్రెలు, 3,62,582 మేకలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యంతోపాటు మందులు అందించాల్సి ఉంది. జిల్లాలో వేల మంది పాడి పశువులును నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. చాలా మంది పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. శీతాకాలం రావడంతో పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంటుంది. జబ్బు చేసిన జీవాలతో పశు వైద్యశాలకు వచ్చిన వారికి మందులు లేవనే సమాధనంతో పశు యజమానులు ఆందోళన చెందుతున్నారు.
పాత కడప పశువైద్యశాలలో పశువుకు
వైద్యం అందిస్తున్న పశువైద్య సిబ్బంది
సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒక సారి మందులు రావాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకసారి మాత్రమే మందులు వచ్చాయి. తొమ్మిది నెలల నుంచి ఇంకా మందులు రాలేదు. మందుల సరఫరా విషయంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పశువుల సంఖ్య ఆధారంగా రాష్ట్ర పశు వైద్యశాఖ మందులు సరఫరా చేయాల్సి ఉంది. లైవ్‌స్టాక్ యూనిట్లు పరిగణించి డైరెక్టరేట్ నుంచే ఏ ప్రాంతానికి ఏ మందులు ఎన్ని అవసరమో ఇండెంట్ పెట్ట్టే ప్రక్రియ ఇప్పుడు ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తయి, మందులు క్షేత్రస్థాయి ఆసుపత్రులకు చేరాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అప్పటి వరకు వేలు ఖర్చు చేసి బయట మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని పశుపోషకులు ఆవేదన చెందుతున్నారు.
పశు వైద్యశాలల్లో వేధిస్తున్న మందుల కొరత
తొమ్మిది నెలలుగా సరఫరా కాని మందులు
పశు యజమానులపై ఆర్థికభారం
బడ్జెట్ కేటాయించారు
జిల్లా పశు వైద్యశాలల్లో మందుల కోసం ప్రభుత్వం 2025–26కు సంబంధించి జిల్లావ్యాప్తంగా రూ. 1,59,27,987 బడ్జెట్ కేయించారు. గ్రామీణ పశువైద్యశాలకు రూ. 50 వేలు, వెటర్నరీ ఆసుపత్రికి రూ. లక్ష, ప్రాంతీయ పశు వైద్యశాలకు రూ.1.25 కేటాయించారు. త్వరలో మందులు వస్తాయి.
–శ్రీనివాసులు, జిల్లా పశువైద్యాధికారి, కడప
అంబా అని అరిచినా...
అంబా అని అరిచినా...
అంబా అని అరిచినా...


