
అయ్యోర్లపై పని భారం !
కడప ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా శాఖ తీరు అధ్వానంగా మారింది. అడ్డగోలు, అసంబద్ధ నిర్ణాయాలు అమలు చేస్తుండడంతో విద్యా ప్రమాణాలు రోజురోజుకు తీసికట్టుగా మారుతున్నా యి. తాజాగా ప్రస్తుతం నిర్వహిస్తున్న అసెస్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల్లో కాకుండా అసెస్‌మెంట్ పుస్తకాల పేరుతో ఉపాధ్యాయులకు అందచేస్తున్నారు. ఈ కొత్త పరీక్షల విధానం ఉపాధ్యాయులకు భారంగా మారడంతోపాటు సర్కారు బడు ల్లో విద్యా ప్రమాణాలు మరింత దిగజారుస్తోంది. ఇప్పటికే బోధనేతర పనులతో సతమతమవుతున్న అయ్యవార్లకు ఇదో అదనపు భారంగా మారంది. దీంతో విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫార్మెటివ్ అసెస్‌మెంట్(ఎ్‌ఫ్‌ఏ–1) పరీక్షల్లో అమల్లోకి తెచ్చిన అసెస్‌మెంట్ బుక్ ఉపాధ్యాయ లోకానికి గందరగోళానికి గురి చేస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 11,29,796 అసెస్‌మెంట్ పుస్తకాలను ఉపాధ్యాయులకు అందజేయనుంది.
పాఠశాలకు చేరిన అసెస్‌మెంట్ బుక్స్...
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి అసెస్‌మెంట్ పుస్తకాలను విద్యాశాఖ ద్వారా పాఠశాలకు పంపించారు. సర్కారు బడుల్లో నిర్వహించే త్రైమాసిక, అర్థవార్షిక, వార్షిక పరీక్షలను ఎఫ్‌ఏ–1,2,3,4లుగా, ఎస్‌ఏ–1,2లుగా నిర్ణయించారు. ఈ పరీక్షలను విద్యార్థులు మూల్యాంకన పుస్త కాలలో రాసేందుకు వీలుగా 1,2వ తరగతులకు మూ డు పుస్తకాలు, 3,4,5 తరగతులకు నాలుగు , 6,7 తరగతులకు ఆరు, 8,9,10 తరగతులకు ఏడు చొప్పున 11,29,796 పుస్తకాలను అందచేయనున్నారు.
ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత
ఈ ఏడాదిలో జరిగే అన్ని పరీక్షల వివరాలను ఈ మూల్యాంకన పుస్తకంలో నమోదు చేసేందుకు ఏడాదంతా ఈ పుస్తకాన్ని ఉపాధ్యాయులు భద్రంగా ఉంచాలి. గతంలో తెల్ల కాగితాలపై పరీక్షలు రాస్తే ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లి మూల్యాంకనం చేసేవారు. మార్కులు నమోదుతో పని పూర్తి అయ్యేది. ఇప్పుడు మూల్యాంకనం పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేదు, వీటిని భద్రపరచడం తలకుమించిన భారమని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వల్ల విద్యావ్యవస్థ గాడితప్పుతోందని విమర్శిస్తున్నాయి. ఫార్మెటివ్, సమ్మెటివ్ ఆసెస్‌మెంట్ పరీక్షలను ఆ పుస్తకాల్లోనే విద్యార్థులు రాయాలి. పరీక్షలు రాసిన తర్వాత వాటిని దిద్ది అందులోనే ఉన్న ఓఎమ్మార్ సీట్‌లో మార్కులు చేయడంతోపాటు ఓఎమ్మార్ షీట్‌ను విద్యాశాఖ ఇచ్చిన యాప్‌లో ఉపాధ్యాయులు అప్‌లోడ్ చేయాలి. దీనిపై ఉపాధ్యాయలు, సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూల్యాంకన
పుస్తకం
పరీక్షల సంస్కరణల పేరుతో
పిల్లలకు మూల్యాంకన పుస్తకాలు
ఈ ఏడాది నుంచి అమల్లోకి తెచ్చిన విద్యాశాఖ
బడుల్లోనే మూల్యాంకనం చేయాల్సి రావడంతో బోధనకు అడ్డంకులు
వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు
11,27,796
ఉమ్మడిజిల్లాకు
మంజూరైన
అసెస్‌మెంట్ బుక్స్

అయ్యోర్లపై పని భారం !