
పరిష్కారం అభూతకల్పనే!
పంటలు దెబ్బతింటున్నాయి
పాసు పుస్తకాలు ఇప్పించండి
దాల్మియాలో ఉద్యోగం ఇప్పించాలి
సాగుభూమి ఆక్రమించారు
రహదారి ఆక్రమించి బ్లాస్టింగ్
● రెవెన్యూలో పేరుకుపోతున్న ఫిర్యాదులు
● గడువులోపు పరిష్కారం వట్టిమాటే!
● రెవెన్యూ కార్యాలయాల చుట్టూ
జనం ప్రదక్షిణలు
కడప సెవెన్‌రోడ్స్ : కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. పరిష్కారానికి నోచుకక మూలనపడుతున్నాయి. వస్తున్న అర్జీల్లో సగంపైన రెవెన్యూశాఖకు సంబంధించినవే ఉన్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్, అసైన్‌మెంట్, ఫ్రీ హోల్డ్ భూముల సమస్య, సర్వే, ఆక్రమణలు, రీ సర్వేలో భూమి విస్తీర్ణం తగ్గడం, తప్పుడు రిజిస్ట్రేషన్లు వంటి సమస్యలు అధికంగా వస్తున్నా యి. కలెక్టరేట్‌కు వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించామంటూ అధికారుల నుంచి ఆదేశాలు వెళుతున్నా క్షేత్ర స్థాయిలో అవి అమలు కావడం లేదు. దీంతో వచ్చిన వారే మళ్లీమళ్లీ గ్రీవెన్స్‌సెల్ చుట్టూ తిరుగుతున్నారు. అందులో కొన్ని....
దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల నవంబరు నుంచి మార్చి వరకు వచ్చే దుమ్ము, ధూళి వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. వంకకు అడ్డంగా ఫ్యాక్టరీ గోడ నిర్మించడం వల్ల వర్షాకాలంలో మా పొలాల్లో నీరంతా నిలుస్తోంది. సర్వే నెంబరు 352లోని 9.15 ఎకరాలు ముంపునకు గురవుతోంది.
– విజయభాస్కర్‌రెడ్డి, నవాబుపేట, మైలవరం
ప్రభుత్వం నిర్వహించిన రీ సర్వే తర్వాత మా భూములకు 1బీ, పాసుపుస్తకాలు రావడం లేదు. ఇందువల్ల అనేక ప్రభుత్వ సౌకర్యాలు కోల్పోవాల్సి వస్తోంది. ఎన్నిమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కరిస్తామంటూ చెప్పడమే తప్ప ఇంతవరకు మాకు న్యాయం జరగడం లేదు.
– దొడ్డా సంజీవరాయుడు, మైలవరం మండలం
2006లో దాల్మియా సిమెంటు కర్మాగారం కోసం 15 ఎకరాల భూమి కోల్పోయాం. అప్పట్లో ఎకరా రూ. 2 లక్షలు ఉన్నప్పటికీ ఉద్యోగం ఇస్తారన్న ఆశతో మా తండ్రి రామసుబ్బారెడ్డి భూములు అప్పగించారు. మా తండ్రికి ఉద్యోగం ఇవ్వలేదు. నాకు తగిన అర్హత వయస్సు వచ్చాక ఉద్యోగం ఇస్తామని చెప్పినా ఇంతవరకు లేదు. ఫ్యాక్టరీ రెండవదశ విస్తరణపై మార్చి 27వ తేది నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వచ్చినపుడు ఆయన దృష్టికి నా సమస్య తీసుకెళ్లాను. కానీ ఇప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. – ఎర్రబోను నాగార్జునరెడ్డి,
నవాబుపేట, మైలవరం మండలం
సర్వే నెంబరు 138/సీ1 లో 1.84 ఎకరాలు నా పేరిట ప ట్టా ఉంది. ఎమ్మెల్యే పుట్టా సు ధాకర్ యాదవ్ ప్రోదల్బంతో తహసీల్దార్ వచ్చి కంచె వేసి బోర్డు పాతారు. ఆ స్థలాన్ని అగ్రవర్ణాలకు కట్టబెట్టాలని చూస్తున్నారు.
– వెంకటయ్య,టి.కొత్తపల్లె, మైదుకూరు
భూతమాపురం–తలమంచిపట్నం మధ్య రహదారిని ఆక్రమించి దాల్మియా యాజమాన్యం బ్లాస్టింగ్ చేస్తోంది. దీంతో వంక ద్వారా వచ్చే నీళ్లు ఆగిపోయాయి. ఓపెన్ బ్లాస్టింగ్ వల్ల సమస్యలు వస్తున్నాయి. – శివశంకర్‌రెడ్డి, రైతు, దుగ్గనపల్లె

పరిష్కారం అభూతకల్పనే!

పరిష్కారం అభూతకల్పనే!

పరిష్కారం అభూతకల్పనే!

పరిష్కారం అభూతకల్పనే!

పరిష్కారం అభూతకల్పనే!