
కడప టీడీపీలో అసమ్మతి మంటలు !
సాక్షి ప్రతినిధి, కడప : కడప టీడీపీలో అసమ్మతి మంటలు చెలరేగాయి. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిని మార్పు చేయాల్సిందిగా త్రిసభ్య కమిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోమవారం హరితా హోట ల్ పార్లమెంటు స్థాయి త్రిసభ్య కమిటీ సమావేశం అందుకు వేదికై ంది. ప్రభుత్వంలోకి వచ్చి 14నెలలు పూర్తయినా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదని, కార్యకర్తలు న్యాయం చేయలేకున్నామని ఆవేదన వ్యక్తమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రా, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం త్రిసభ్య కమిటీ టీడీపీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత కడపలో ఏడు స్థానాలను కై వసం చేసుకున్నామని,సమీకరణలో జరిగిన లోపాల కారణంగా బద్వేలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు లభించినా కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు దక్కలేదని వివరించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో కమలాపురం నియోజకవర్గంలో 25 మందికి పదవులను ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఎలాంటి పదవులు రాలేదని వివరించారు. జమ్మలమడుగు ఇన్‌చార్జ్ భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు పదువులు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపా రు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి మాట్లాడు తూ వైఎస్సార్‌సీపీ తమపై దుష్ప్రచారం చేస్తోందని... ఇది అంతర్గత సమావేశం పార్టీకి ఇబ్బందులు తలెత్తకుండా వ్యాఖ్యానించాలని చెప్పుకొచ్చారు.
జిల్లా అధ్యక్షుడిపై ఫిర్యాదుల పరంపర...
త్రిసభ్య కమిటీ దృష్టికి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుడిని మార్చాలంటూ అప్పుడే పార్టీకి ప్రయోజనమని పలువురు వివరించినట్లు సమాచారం. ఆమేరకు కొందరు పుత్తా నరసింహారెడ్డికి జిల్లా అధ్యక్షపదవి అప్పగించాల్సిందిగా సూచించిగా, పార్టీని నమ్ముకొని ఉన్న గోవర్ధన్‌రెడ్డికి కట్టబెట్టాలని మరికొందరు అభ్యర్థించినట్లు సమాచారం. తద్వారా పార్టీ కార్యకర్తలకు మంచి మేసేజ్ ఇచ్చినట్లు కూడా అవుతోందని వివరించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది హరిప్రసాద్ పేరు సూచించి కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని వివరించినట్లు సమాచారం. అన్ని విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని త్రిసభ్య కమిటీ సభ్యులు సూచించినట్లు తెలుస్తోంది.
టీడీపీ పార్లమెంటు స్థాయి
సమావేశంలో బహిర్గతం
14 నెలలు అవుతున్నా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఏదీ?
ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్సీ పుత్తా,
జమ్మలమడుగు ఇన్‌ఛార్జి భూపేష్
జిల్లా అధ్యక్షుడు వాసును
మార్చాల్సిందిగా ఫిర్యాదులు
అధ్యక్ష రేసులో పలువురు సీనియర్లు