
దివ్యాంగుల పెన్షన్ తొలగింపు దుర్మార్గం
కడప సెవెన్‌రోడ్స్ : తాము అధికారంలోకి వస్తే పెన్ష న్లు పెంచుతామని హామీలు గుప్పించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల పెన్షన్లను తొలగించడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. పెన్షన్ల తొలగింపు వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వంద శాతం వైకల్యం ఉన్న వారికి కూడా 40 శాతానికి తగ్గిస్తూ పెన్షన్ ఎగ్గొట్టే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం దిగజారిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దివ్యాంగుల విభా గం జిల్లా అధ్యక్షుడు అహ్మద్‌బాష సచివాలయ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీ చేసి సెప్టెంబరు నెల నుంచి పెన్షన్ తొలగిస్తున్నట్లు తెలుపడం దారుణమని విమర్శించారు. తొలగించిన పెన్షన్‌ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్‌చేశారు. తాను ప్రశ్నించే వ్యక్తిని అంటూ చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనముద్ర దాల్చారని నిలదీశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షఫీ, పాకా సురేష్, అక్బర్ అలీ, అజ్మతుల్లాఖాన్, పార్టీ నాయకులు శ్రీరంజన్‌రెడ్డి, యానాదయ్య, గౌస్‌బాషా, పులి సునీల్‌కుమార్, సీహెచ్ వినోద్‌కుమార్, బూసిపాటి కిశోర్‌కుమార్, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షఫీవుల్లా, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకేసుల బాదుల్లా, మహిళా విభాగం నాయకులు టీపీ వెంకట సుబ్బమ్మ, పత్తి రాజేశ్వరి, వైఎస్ సాయిబాబా, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షురాలు సునీతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధర్నాలో వైఎస్సార్ సీపీ
రాష్ట్ర కార్యదర్శి రెడ్యం