
కౌన్సెలింగ్ ప్రశాంతం
కడప ఎడ్యుకేషన్ : కడప నగర శివార్లలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇందులో భాగంగా బీఎఫ్‌ఏ ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు కౌన్సెలింగ్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా 70 శాతం విద్యార్థులు కౌన్సిలింగ్‌కు హాజరై వీసీ డాక్టర్ జి.విశ్వనాఽథ్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులు సీట్ అలాట్మెంట్ పొందారు.
సెప్టెంబర్ 3న రెండవ దశ కౌన్సెలింగ్
డాక్టర్ వైఎస్సార్ ఏఎఫ్‌యూలో సెప్టెంబర్ 3న బీఎఫ్‌ఎ/బి డిజైన్ కోర్సులకు 2వ దశ కౌన్సెలింగ్ ఉంటుందని వీసీ తెలిపారు. మరింత సమాచారం కోసం www.yrrafuac.in వైబ్సెటును సందర్శించాలని ఆయన తెలిపారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రాధాన్యత
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయా ఫిర్యా దు లపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరి ష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ ఆదేశించారు. సోమ వారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం’ (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన 120 మంది ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ ముఖాము ఖి మాట్లాడారు. ఆయా ఫిర్యాదుల గురించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు.
డీసీసీ బ్యాంకు అభివృద్ధికి
కృషి చేయాలి
– ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు
కడప అగ్రికల్చర్ : డీసీసీ బ్యాంకు అభివృద్ధికి ఉద్యోగులంతా సమిష్టిగా కృషి చేయాలని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. సోమవారం కడపలోని డీసీసీ బ్యాంకును బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంకు స్థితిగతుల గురించి అరా తీశారు. అనంతరం చైర్మన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా రైతాంగానికి డీసీసీ బ్యాంకు అండగా నిలవాలని అందుకు ఎన్ని కోట్ల రుణాలు కావాలన్నా కడపకు మంజూరు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డీసీసీ బ్యాంకు సీఈఓ రాజామణి, డీజీఎం ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
28న డీఎస్సీ అభ్యర్థులసర్టిఫికెట్ల పరిశీలన
కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీ –2025 అభ్యర్థులకు ఈనెల 28వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలన కడప బాలాజీనగర్‌లోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరిశీలన నిమిత్తం తమకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు.
గణపతి ఆకృతిలో విద్యార్థులు
కలసపాడు : వైఎస్సార్ కడప జిల్లాలోని కలసపాడులో సెయింట్ ఆంటోని ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యార్థులు గణపతి ఆకృతిలో ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిత్తా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సర్వ మతాలకు అతీతంగా పండుగల సందర్భంలో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలని సూచించారు.

కౌన్సెలింగ్ ప్రశాంతం

కౌన్సెలింగ్ ప్రశాంతం