
ఎస్‌ఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు( రివైజ్డ్)
కడప రూరల్ : పులివెందుల ఎస్‌ఐ నారాయణపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పులివెందులలోని ఇస్లాంపురం వీధికి చెందిన సులోచన తెలిపారు. సోమవారం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక నెల క్రితం ఎవరో ఏదో చెప్పారని ఎస్‌ఐ నారాయణతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు తన ఇంటికి వచ్చారని అన్నారు. తనకు సంబంధం లేని అంశాలను అడగడంతో తెలియదని చెప్పానని తెలిపారు. ఆ ఎస్‌ఐ తన పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు కొట్టారని పేర్కొన్నారు. ఆయన బీరువా బీగాలు అడిగాడని, లేవని చెప్పడంతో బీరువాను పగుల గొట్టి అందులో ఉన్న రూ 1.39 లక్షలు తీసుకెళ్లారని ఆరోపించారు. మా అమ్మకు ఆరోగ్యం బాగా లేనందున, బంగారం కుదువ పెట్టి డబ్బు తెచ్చామన్నారు. అమ్మ వైద్యం కోసం తెచ్చిన డబ్బును ఆ ఎస్‌ఐ తీసుకెళ్లారని ఆరోపించారు. తాను ఏదైనా తప్పు చేసి ఉంటే విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయమై సోమవారం కడపలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు ఆ ఎస్‌ఐ నుంచి రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని వేడుకున్నారు. జై హిందుస్ధాన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
కానిస్టేబుల్ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన
కడప అర్బన్ : కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల నియామక ప్రక్రియలో భాగంగా, అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమాన్ని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పరిశీలనకు మొత్తం 352 మంది అభ్యర్థులకు గాను 190 మంది సివిల్, ఏపీఎస్పీ అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్న అభ్యర్థులకే ఉద్యోగం వస్తుందని, తప్పుడు పత్రాలు ఉన్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి (ఎ.ఆర్) బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్‌ఐలు వీరేష్, టైటస్, శివరాముడు, ఏఓ కె.వెంకటరమణ, సూపరింటెండెంట్‌లు ఎస్.గౌస్ పీర్, సురేష్ బాబు, సీనియర్ అసిస్టెంట్ బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
భర్త, బంధువులు వేధిస్తున్నారని ఫిర్యాదు
కడప అర్బన్ : కడప నగరంలోని మరియాపురానికి చెందిన వసంతకు, కలికిరికి చెందిన ప్రవీణ్‌కుమార్‌కు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. వసంత, తన భర్తతోపాటు, అత్త, బంధువులు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప తాలూకా సీఐ టి.రెడ్డెప్ప తెలిపారు.
రిమ్స్ మార్చురీలో రెండు మృతదేహాలు
కడప అర్బన్ : కడప రిమ్స్ మార్చురీలో రెండు గుర్తు తెలియని మృతదేహాలున్నాయి. ఎవరైనా సరైన ఆధారాలతో తమను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

ఎస్‌ఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు( రివైజ్డ్)

ఎస్‌ఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు( రివైజ్డ్)

ఎస్‌ఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు( రివైజ్డ్)