
జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టినా ఎమ్మెల్యేపై చర్యల్ల
ప్రొద్దుటూరు : జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌పై ప్రభుత్వం ఇంత వరకు తగిన చర్యలు తీసుకోలేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆక్షేపించారు. ఇటీవల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళలపై దాడులకు పాల్పడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సోమవారం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లేకపోయినా భరించగలిగామని, సీ్త్రలకు స్వేచ్ఛ, గౌరవం, భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పాలకులే కీచకులయ్యారని విమర్శించారు. గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని విమర్శించినప్పుడు తాను ఖండించానన్నారు. తల్లి ఎవరికై నా తల్లేనన్నారు. ఎన్టీఆర్ తల్లి పాదాలను ఎమ్మెల్యే కన్నీటితో కడిగి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ధర్నా చేయడానికి, ప్రెస్‌మీట్ పెట్టడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. కేవలం జూనియర్ ఎన్టీఆర్‌పై అసూయతోనే చంద్రబాబు, లోకేష్ ఇలా చేస్తున్నారని, జూనియర్ ఎన్టీఆరే ఎన్టీఆర్‌కు అసలైన వారసుడన్నారు.
ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు
రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, మాట్లాడినా, ఉద్యోగులపై దాడి చేసినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాచమల్లు నిలదీశారు. ఇప్పటికై నా స్థాయిని చూడకుండా తప్పు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించకుండా అధికార పార్టీకి గుమస్తాలుగా, బానిసలుగా పని చేస్తుండటం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సత్యం, రాగుల శాంతి, లావణ్య, నాయకుడు బీఎన్‌ఆర్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి