అదును.. పదును
● జిల్లాలో కురుస్తున్న వర్షం
● లోతు దుక్కులతో భూసారం పెంపు
● చీడపీడలు, కలుపుమొక్కలకు చెక్
● భూగర్భ జలాల నిల్వకు అవకాశం
కడప అగ్రికల్చర్: ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి పంటల సాగులో రైతులకు కలుపు సమస్య దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కలుపు యాజమాన్య ప్రక్రియ వర్షం కురిసినప్పటి నుంచే చేపడితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. వర్షం కురవగానే భూమిలోని కలుపునకు సంబంధించిన విత్తనాలన్నీ మొలకెత్తుతాయి. తక్షణం లోతు దుక్కులను చేపడితే చాలా మటుకు కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. పంటల సాగు సమయానికి మీద మీద రెండు సార్లు దుక్కులు(సేద్యాలను) చేస్తే కలుపు మొక్కలు దాదాపు నివారించుకోవచ్చ. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1,28,084 హెక్టార్లలో పంటల సాగు లక్ష్యంగా వ్యవసాయ అధికారులు నిర్దేశించారు. జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వాతావరణ మార్పుతోపాటు రుతుపవనాల ఆగమనంతో జిల్లాలో వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఆరుతడి పంటలైన సజ్జ, జొన్న, మొక్కజొన్న, కంది, ెపెసలు, మినుములు, పత్తి, వేరుశనగ, సన్‌ఫ్లవర్, సోయాబీన్ తదితర పంటలు సాగు చేయాల్సి ఉంది. మారిన వ్యవసాయ పద్ధతులతో వివిధ పంటల్లో కలుపు నివారించేందుకు రైతులు పలు రకాల మందులపై ఆధార పడుతున్నారు. విత్తనం వేశాక, పైరు పెరిగే దశలో మందుల వాడకంతో కలుపు నివారణ చేపడుతున్నారు. ఇలా కలుపు మందులను పిచికారి చేయడం ద్వారా భూమి సారవంతం కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కలుపు మందులపై ఆధార పడే ముందు రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
పంటల నూర్పిడి తరువాత..
పంటల నూర్పిడి తరువాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు భూమిని దున్నకుండా అలాగే వదిలేస్తారు. దీంతో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. కావున ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో రైతులు పంటలు సాగు చేసుకునే సమయానికి లోతు దుక్కులను చేపడితే బోలెడు లాభాలు ఉన్నాయి. లోతు దక్కులు చేయడం వల్ల భూమి పైపొరలు కిందకి, కింద పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. అలాగే లోతు దుక్కలను చేపట్టడం వల్ల భూమిలో ఉండే పురుగులు, కలుపు మొక్కల నివారణ జరుగుతుంది. వేసవిలో చాలా మంది రైతులు పశువులు, ఆవులు, గొర్రెల పెంట, కంపోస్టు ఎరువు, మట్టిని వెదజల్లడం చేస్తారు. ప్రస్తుతం దున్నుతున్న దుక్కులతో అవన్నీ భూమిలో కలిసిపోయి భూమి సారవంతంగా మారుతుంది. దీంతోపాటు భూమి ఎక్కువకాలం తేమను కలిగి ఉంటుంది.
రైతులు లోతు దక్కులు చేపట్టాలి
ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం పదునుతో రైతులు తమ బీడు భూములను లోతుగా దక్కులు చేసుకోవాలి. దీంతో వ్యవసాయ భూమి సారవంతంగా మారుతుంది. లోతు దుక్కులతో భూమిలో ఉన్న చీడపీడలతోపాటు కలుపు నివారణతో నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. దీంతోపాటు భూమిలో తేమ శాతం పెరుగుతుంది.
– అయితా నాగేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి
పంటలు లేనప్పుడే..
వేసవిలో చాలా వరకు భూమి ఖాళీగా ఉంటుంది. అలాంటి సమయంలో పంటలను ఆశించే అనేక రకాల పురుగు లు పంట కోత దశల్లో వాటి నిద్రావస్థ దశలో.. నేల, చెత్తాచెదారం, కోయ కాడల్లో ఎక్కవకాలం గడపుతాయి. అలాగే తెగుళ్లను కలుగ చేసే శిలీంద్రా లు భూమిలోపల ఆశ్రయం పొందుతా యి. వీటి శీలింద్ర భీజాలు భూ మిలో నిల్వ ఉంటాయి. ప్రస్తుతం కురిసిన వర్షంతో లోతు దుక్కుల వల్ల నిద్రావస్థ దశలో భూమిలోని చీడ పురుగు కోశా లు, గుడ్లు, లార్వాలు పక్షు లు, కొంగలు, కాకులు తిని నాశనం చేస్తాయి. దీంతోపాటు కులుపునకు సంబంధించిన విత్తనాలు కూడా చనిపోతాయి.
అదును.. పదును
అదును.. పదును


