కడప అర్బన్ : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ ఉగాది పండుగ సంబరాలను కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్ కుమార్, అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, పోలీస్ అధికారులు, సిబ్బంది విచ్చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉగాది ప్రత్యేక పూజల్లో పాల్గొని ఉగాది పచ్చడి, మిఠాయిలు అందజేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉత్సాహ భరిత వాతావరణంలో ఉగాది సంబరాలు జరిపారు. జిల్లా ప్రజలకు, సిబ్బందికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ శ్రీ బి. రమణయ్య, ఆర్.ఐ లు ఆనంద్, వీరేష్, శ్రీశైల రెడ్డి, శివరాముడు, ఆర్.ఎస్.ఐ లు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


