జమ్మలమడుగు : ద్విచక్రవాహనాల్లో అరుణాచలం బయలుదేరిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన నలుగురు యువకులు ప్రముఖ శైవ క్షేత్రమైన తమిళనాడులోని తిరునామలై అరుణాచలానికి ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. తమిళనాడులోని రాణికోట పట్టణ సమీపంలో వీరి ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీకొనడంతో గంజికుంట శేషాచలం(29) బడిగించల నాగేంద్ర(31) కిందపడ్డారు. అదే సమయంలో వెనుకవైపు నుంచి వచ్చిన కారు వీరిద్దరిపై నుంచి వెళ్లడంతో శేషాచలం, నాగేంద్ర అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గంజికుంట శేషాచలంకు వివాహమై ఒక కుమార్తె ఉంది. సోమవారం సాయంత్రం మృతదేహాలు స్వగ్రామమైన వేపరాలకు చేరాయి.
వేపరాలకు చెందిన ఇద్దరి మృతి
తమిళనాడులో రోడ్డు ప్రమాదం
తమిళనాడులో రోడ్డు ప్రమాదం