యాదగిరిగుట్ట: శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం ఆలయ ఆచార వ్యవహారాలతో చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
7న చేనేత చైతన్య మహాసభ
రామన్నపేట : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి చేనేత చైతన్య మహాసభ నిర్వహిస్తున్నట్లు ఆ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెండెం లక్ష్మీనారాయణ, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బూరుగు వెంకటేశం తెలిపారు. ఈ మేరకు శనివారం రామన్నపేటలో మహాసభ వాల్‌పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. పద్మశాలీ ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల అధ్యక్షులు, వృత్తిదారులు మహాసభకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాపోలు రాజశేఖర్, రాపోలు షణ్ముఖం, రచ్చ యాదగిరి, జెల్ల వెంకటేశం, అప్పం లక్ష్మీనర్సు, పున్న వెంకటేశం, బడుగు రమేష్, మహేశ్వరం అశోక్, కై రంకొండ నందు, కొంగరి నర్సింహ, గంజి అశోక్, చిందం ఉమాకాంతం పాల్గొన్నారు.
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి
మోత్కూరు : చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోత్కూరులోని కేఆర్ భవన్‌లో దొండ రాములు అధ్యక్షతన నిర్వహించిన బీసీ హక్కుల సాధన సమితి మండల మహాసభలో ఆయన మాట్లాడారు. సంఘం మండల కమిటీ అధ్యక్షుడిగా పోచం కన్నయ్య, ఉపాధ్యక్షుడిగా దొండ రాములు, ప్రధాన కార్యదర్శిగా పెండెం వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా అంబటి సోమయ్య, కోశాధికారిగా తాడూరి లక్ష్మీనర్సయ్యలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అన్నెపు వెంకట్, చాపల అంజయ్య, దొండ ఎల్లయ్య, బి.నర్సయ్య, భువనగిరి ముత్యాలు, బోయిని వెంకన్న, తొట్ల యాదగిరి, కొల్లు లక్ష్మయ్య, ఎలుగు భిక్షం పాల్గొన్నారు.


