తాగునీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు : అదనపు కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు : అదనపు కలెక్టర్‌

Aug 2 2026 1:16 AM | Updated on Aug 2 2026 1:16 AM

మోత్కూరు : తాగునీటి సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.భాస్కర్‌రావు సూచించారు. మోత్కూరు పట్టణంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం సంబంధిత అధికారులతో సమీక్షించి మాట్లాడారు.మోత్కూరు పెద్ద చెరువు కట్ట మరమ్మతుల కారణంగా మిషన్‌ భగీరథ పైపు లైన్‌ స్వల్పంగా దెబ్బతిన్న నేపథ్యంలో మరమ్మతులు పూర్తి చేయించడంతో ప్రస్తుతం నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ బాలాజీ, అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించాలి

కస్తూర్బా విద్యాలయాల్లో చదివే విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఎం.భాస్కర్‌రావు సూచించారు. శనివారం మోత్కూరు మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. వంట గది, స్టోర్‌ రూమ్‌, భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థినులు నిద్రించే గదిలో గోడ ఫ్యాన్లు అందజేస్తానని, పాఠశాల ఆవరణలో విద్యార్థినులు ఒకేచోట కలిసి భోజనం చేసేందుకు రేకుల షెడ్డు నిర్మిస్తారని చెప్పారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య, ఎంపీడీఓ బాలాజీ, మిషన్‌ భగీరథ ఏఈ నితిన్‌రెడ్డి, ఎస్‌ఓ యాదమ్మ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement