ఆస్పత్రిలో వసతులు లేక రోగుల ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో వసతులు లేక రోగుల ఇబ్బందులు

Aug 2 2026 1:16 AM | Updated on Aug 2 2026 1:16 AM

భువనగిరి: భువనగిరి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రెగ్యులర్‌ సూపరింటెండెంట్‌ను నియమించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌. వీరయ్య కోరారు. శనివారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని సందర్శించి మాట్లాడారు. ఆస్పత్రిలో సరైన వసతులు లేవని , ఖాళీగా ఉన్న వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో నర్సింగ్‌ స్టాఫ్‌కు రెస్ట్‌ రూమ్‌ లేక ఇబ్బందులుపడుతున్నారన్నారు. ఓపీ కౌంటర్‌ అదనంగా లేకపోవడం వల్ల టోకెన్‌ కోసం రోగులు బారులుదీరాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. వార్డులో మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంతో దుర్వాసన వస్తోందన్నారు. సీటీస్కాన్‌ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా అనుమతులు ఇవ్వలేదన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులతో ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యులు ఒప్పందం చేసుకున్నట్లు అనుమానంగా ఉందన్నారు. టీ హబ్‌కు వచ్చే శాంపిల్స్‌ను పరీక్షించి సకాలంలో రిపోర్టులు పంపడం లేదన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్‌ మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రులతో వైద్యులు కుమ్మకై ్క రోగులను ప్రైవేటుకు పంపిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దయ్యాల నర్సింహ, నాయకులు ముత్యాలు, రాజు, అనిల్‌, మాతయ్య, లలిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement