నల్లగొండ టౌన్ : ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందించాలని రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన రెడ్డి జాగృతి విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షుడు ఎంరెడ్డి నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రముఖ నాయకులు నీరుడు దయాకర్ రెడ్డి, యానాల ప్రభాకర్ రెడ్డి, మందడి వెంకట్‌రెడ్డి, వంగాల నరేందర్‌రెడ్డి, పైళ్ల మధుసూదన్‌రెడ్డి, మారెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


