చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి

Jul 20 2026 1:56 AM | Updated on Jul 20 2026 1:56 AM

ఆలేరు : చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం ఆలేరు పట్టణంలో హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సొసైటీ చైర్మన్‌గా దాసి శంకర్‌, డైరెక్టర్లుగా చింతకింది రంగ, గాడిపెల్లి రమేష్‌,ఎలగందుల ఉమాబుషి, బింగి నర్సింహులు, అంకం మల్లేశం, అందె రామలు, ఎలగందుల పద్మతో చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ ఆలేరు సొసైటీ చైర్మన్‌ దాసి శంకర్‌కు టెస్కో డైరెక్టర్‌ పదవి వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.25లక్షల నిధులు మంజూరు చేస్తానన్నారు. చేనేత ఉత్పత్తులు ప్రభుత్వరంగ సంస్థలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో చేనేతలకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ మాజీ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మాజీ ఆప్కో చైర్మన్‌ మండల శ్రీరాములు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బీజన బాలమణి, వైస్‌ చైర్మన్‌ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు జూకంటి సంపత్‌, జెట్ట నీరజ తదితరులు పాల్గొన్నారు.

ఫ ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement