అతివలకు ఆరోగ్య పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

అతివలకు ఆరోగ్య పరీక్షలు

Jul 19 2026 2:14 AM | Updated on Jul 19 2026 2:14 AM

ఉచితంగా చేసే 30 రకాల పరీక్షలు ఇవే..

సాక్షి, యాదాద్రి: మహిళల ఆరోగ్య స్థితిపై సమగ్రం గా రూపొందించి, వ్యాధులను ముందస్తుగా గుర్తించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెర్ఫ్‌, మెప్మా పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద మొదటగా జిల్లాలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. వీటిలె బీబీనగర్‌, షారా జీపేట, భూదాన్‌పోచంపల్లి పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇక్కడ లభించే ఫలితాల ఆధారంగా విడతల వారీగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల సభ్యులందరికీ ఈ సేవలను విస్తరించనున్నారు.

3 నెలల్లో 2 లక్షల మంది మహిళలకు పరీక్షలు

మూడు నెలల కాలంలోనే సుమారు 2 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు వైద్య పరీక్షలు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో మొత్తం 1,94,493 మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. వారందరికీ దశలవారీగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం రోజుకు 800 నుంచి 2,000 వరకు నమూనాలను పరీక్షించగల సామర్థ్యం ఉన్న అత్యాధునిక ‘అనలైజర్‌’ మిషన్లను సమకూర్చుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ నిర్వహణ కోసం ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇతర సాంకేతిక సిబ్బందిని కొత్తగా నియామకం చేసుకుంటున్నారు. కాగా. మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య పరీక్షలు, నమూనాల సేకరణ, డేటా నమోదు, ఫాలోఅప్‌ కోసం వైద్య ఆరోగ్యశాఖ, మెప్మా, మున్సిపల్‌ శాఖ, డీఆర్‌డీఏ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. డీసీహెచ్‌ఎస్‌, ఆర్‌ఎంఓలు, వైద్యులు, టీ–హబ్‌ ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు.

ఫ బీబీనగర్‌, షారాజీపేట, భూదాన్‌

పోచంపల్లి పీహెచ్‌సీలు ఎంపిక

ఫ 3 నెలల్లో 2 లక్షల మంది మహిళలకు స్క్రీనింగ్‌ లక్ష్యం

ఫ వైద్య పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం

బయోకెమిస్ట్రీ పరీక్షలు : బ్లడ్‌ షుగర్‌, సీరం బిలిరుబిన్‌, సీరం క్రియాటినిన్‌, బ్లడ్‌ యూరియా, ఎస్‌జీపీటీ, ఎస్‌జీఓటీ, సీరం ఆల్కలైన్‌ ఫాస్ఫటేస్‌, సీరం టోటల్‌ ప్రొటీన్‌, సీరం ఆల్బుమిన్‌.

హిమటాలజీ పరీక్షలు : థైరాయిడ్‌ నిర్ధారణకు టీఎస్‌హెచ్‌, హీమోగ్లోబిన్‌, తెల్ల రక్తకణాల సంఖ్య, ప్లేట్‌లెట్‌ కౌంట్‌, ఎర్ర రక్తకణాల సంఖ్య.

స్పోక్‌ స్థాయి పరీక్షలు : బ్లడ్‌ గ్రూప్‌, ఎత్తు, బరువు, బాడీ మాస్‌ ఇండెక్స్‌ (BMI), రక్తపోటు (బీపీ), వైకల్య నిర్ధారణ, శరీర ఉష్ణోగ్రత, గుండె స్పందన రేటు, శ్వాస రేటు, కంటి పరీక్షలు, నోటి పరీక్షలు, చర్మం–గోళ్ల పరీక్షలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement