ఆషాఢం మహిళలకు ప్రత్యేకమైనది | - | Sakshi
Sakshi News home page

ఆషాఢం మహిళలకు ప్రత్యేకమైనది

Jul 19 2026 2:14 AM | Updated on Jul 19 2026 2:14 AM

ఆషాఢం మహిళలకు ప్రత్యేకమైనది

యాదగిరిగుట్ట : ఆషాఢ మాసం మహిళలకు ప్రత్యేకమైన మాసం. ఈ మాసంలో అధికంగా గ్రామీణా ప్రాంతాల్లో బోనాల పండుగలు చేస్తారు. ముఖ్యంగా కొత్త నీరు రావడంతో పాటు నూతన ధాన్యాన్ని పండించేందుకు వరి నాట్లు వేస్తారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఉత్తరాణం పోయి.. దక్షిణాయన పుణ్య కాలం వచ్చింది. దక్షిణాయనంలో గ్రామ దేవతల పండుగలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇందులో భాగంగానే మహిళలు గోరింటాకు పెట్టుకుంటారు. ప్రధానంగా కొత్తగా వివాహం జరిగిన వారు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకును పెట్టుకొని, సంప్రదాయంగా కనిపిస్తారు. ఈ ఆషాఢ మాసాన్ని దీక్షల మాసం అంటారు. ఆషాఢ పౌర్ణమి నుంచి చాలా మంది మునులు, స్వామిజీలు, ఆయా ప్రాంతాల్లో కొత్తగా వివాహాలు జరిగిన పురుషులు దాంపత్య జీవితంలో భాగస్వామికి దూరంగా ఉండేందుకు దీక్షలు తీసుకొని తీర్థ స్నానాలు చేస్తారు. మహిళలు మంచి పూజలు చేస్తే మంచిసంతానం కలుగుతుంది. మహిళలు ఎరుపు వర్ణం కలిగిన గోరింటాకును పెట్టుకొని అమ్మవారిలా నిండు సంప్రదాయంతో కనిపిస్తారు.పసుపు, కుంకుమను ఇంట్లో పూజించే గడపకు పెట్టుకుంటాం. అలా గే మహిళను గౌరవించాలనే సంప్రదాయంలో గోరింటాకును పెట్టుకుంటారు.

– కాండూరి వెంకటచార్యులు,

యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధానార్చకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement