ముగిసిన ఇంటర్‌ సర్కిల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఇంటర్‌ సర్కిల్‌ పోటీలు

Jul 19 2026 2:14 AM | Updated on Jul 19 2026 2:14 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌ : హనుమకొండలోని జేఎన్‌ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్‌కో, టీజీ ఎనన్పీడీసీఎల్‌, టీజీ ఎస్పీడీసీఎల్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్‌ సర్కిల్‌ వాలీబాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, క్యారం క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. టీజీ ఎన్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్‌) టి.మధుసూదన్‌. హెచ్‌ఆర్‌డీ సి.ప్రభాకర్‌ ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు.

గెలుపొందిన జట్లు..

బాల్‌ బ్యాడ్మింటన్‌ విభాగంలో టీజీ ఎన్పీడీసీఎల్‌ వరంగల్‌ ఆపరేషన్‌ సర్కిల్‌ జట్టు ప్రథమ బహుమతి, టీజీ ఎస్పీడీసీఎల్‌ నల్లగొండ సర్కిల్‌ జట్టు ద్వితీయ బహుమతి, మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ జట్టు తృతీయ బహుమతి కై వసం చేసుకుంది. వాలీబాల్‌ విభాగంలో టీజీ ఎన్‌న్పీడీసీఎల్‌ ఖమ్మం ఆపరేషన్‌ సర్కిల్‌ జట్టు ప్రథమ బహుమతి, టీజీ ఎస్పీడీసీఎల్‌ మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ జట్టు ద్వితీయ బహుమతి, హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌ జట్టు తృతీయ బహుమతి సాధించింది. క్యారం విభాగంలో టీజీ ఎన్‌న్పీడీసీఎల్‌ నిజామాబాద్‌ సర్కిల్‌ ప్రథమ బహుమతి, విద్యుత్‌ సౌధ, హైదరాబాద్‌ ద్వితీయ బహుమతి, ట్రాన్స్‌కో వరంగల్‌ తృతీయ బహుమతి దక్కించుకున్నాయి.

సాగర్‌లో కార్మిక శాఖ కమిషనర్‌

నాగార్జునసాగర్‌ : రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌ పమేలా సత్పతి కుటుంబ సమేతంగా శనివారం నాగార్జునసాగర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన డ్యాం, జలవిద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం బుద్ధవనంలో ధ్యానవనం, స్థూపవనం, జాతక పార్కును సందర్శించారు. మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతి వెలిగించారు. బుద్ధవనం అధికారులు శాసన, రవిచంద్ర ఆమెను సత్కరించారు. ఆమె వెంట అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, ప్రొటోకాల్‌ అధికారి దండ శ్రీనివాసరెడ్డి, కార్మిక శాఖ అధికారి నాగరాజు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement