రామన్నపేట : మండలంలోని సిరిపురం గ్రామంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఏర్పాటు చేసిన ప్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను గురువారం జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) శ్రీనివాస్‌రెడ్డి, ఐఐసీటీ శాస్త్రవేత్త కిరణ్ సందర్శించారు. చేనేత రంగుల అద్దకంలో వాడిన నీటితో పాటు డ్రెయినేజీ నీటిని శుద్ధిచేసి కాలుష్యం తగ్గించడం ఈ ప్లాంట్ ఏర్పాటు ఉద్దేశం. ప్లాంట్ పనితీరును శాస్త్రవేత్తలు అధికారులకు వివరించారు. త్వరలో ప్లాంట్‌ను గ్రామ పంచాయతీకి అప్పగించనున్నట్లు డీపీఓ తెలిపారు. వారి వెంట డీఎల్‌పీఓ ప్రతాప్‌నాయక్, ఎంపీడీఓ ఎ. రాములు, సర్పంచ్ అంబటి ఉపేంద్రరవీందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ ఎం. అనూషారమేష్ మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు ఉన్నారు.


