బా్యంకుల్లో నగదు కొరత | - | Sakshi
Sakshi News home page

బా్యంకుల్లో నగదు కొరత

Jul 16 2026 4:54 AM | Updated on Jul 16 2026 4:54 AM

సాక్షి, యాదాద్రి: జిల్లాలో నగదు కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సొంత ఖాతాలో డబ్బున్నా అవసరానికి తీసుకోలేని దుస్థితి నెలకొంది. ఏటీఎంల వద్ద ఎక్కడ చూసినా శ్రీనో క్యాష్‌శ్రీ బోర్డులే దర్శనమిస్తున్నాయి. బ్యాంకులకు వెళ్తే ఎవరైనా డిపాజిట్‌ చేస్తేనే.. ఆ డబ్బులను విత్‌డ్రా కోసం ఇస్తున్నారు. అది కూడా అడిగినంత కాకుండా సగం మాత్రమే ఇస్తూ.. మిగతాది ఆన్‌లైన్‌లో బదిలీ చేసుకోవాలని అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. వానాకాలం వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో చేతిలో డబ్బులు లేక రైతులు, వృద్ధులు, మహిళలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నోట్ల రద్దు నాటి కష్టాలు మళ్లీ కళ్లముందు కదలాడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

ఇలా పెట్టగానే.. అలా అయిపోతున్నాయి

ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండటం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఏటీఎంలకు వెళితే ‘నో క్యాష్‌’ అని వస్తోంది. వృద్ధులు, మహిళలు, విద్యార్థుల అత్యవసరాల కోసం బ్యాంకులు కొంతవరకు నగదును ఏటీఎంలలో రిజర్వ్‌ చేస్తున్నప్పటికీ, మిగతా ఖాతాదారులు కూడా అక్కడే నగదు ఉపసంహరణలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ఒత్తిడి పెరుగుతోంది. ఏటీఎంలలో కూడా నగదు లోడింగ్‌ సామర్థ్యం తగ్గిపోవడం వల్ల చాలా చోట్ల అవి ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.

డిపాజిట్‌ చేస్తేనే నగదు:

జిల్లాలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వింత పరిస్థితి నెలకొంది. ఎవరైనా ఖాతాదారులు డబ్బులు డిపాజిట్‌ చేస్తేనే మరొకరికి నగదు ఇస్తున్నారు. డబ్బులు జమ కాకపోతే నగదు ఇవ్వలేమని తేల్చి చెబుతున్నారు. రోజువారీగా జమైన డబ్బుల నుంచి కూడా, కస్టమర్లు అడిగిన మొత్తంలో సగం నగదును మాత్రమే ఇచ్చి.. మిగిలిన మొత్తాన్ని డిజిటల్‌ బదిలీ (ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌) చేసుకోమని చెబుతున్నారు.

డిజిటలైజేషన్‌లో భాగమేనా?:

ఆర్థిక లావాదేవీలలో డిజిటలైజేషన్‌ ప్రక్రియను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా నగదుపై ఈ అప్రకటిత పరిమితులు కొనసాగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. డిజిటల్‌ చెల్లింపుల వినియోగాన్ని వేగవంతం చేసే వ్యూహంలో భాగంగానే ఈ తాత్కాలిక నగదు కొరత ఏర్పడి ఉండవచ్చని తెలుస్తోంది.

కూలీలకు డబ్బులివ్వలేక రైతుల ఇబ్బందులు

జిల్లా వ్యాప్తంగా 15 రోజులుగా బ్యాంకుల్లో సరిపడా నగదు నిల్వలు లేవు. పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొద్దిమంది రైతులకు రూ.20 వేల నుంచి రూ.50 వేల చొప్పున మాత్రమే ఇచ్చారు. చాలామంది రైతులు డబ్బులు లేవనగానే వెనుదిరిగిపోయారు. నాట్లు వేసే కూలీలకు, వ్యవసాయ పెట్టుబడులకు రోజూవారీగా నగదు ఇవ్వాల్సి ఉండటంతో రతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విత్‌డ్రా కోసం వెళ్తే సగం డబ్బులే ఇస్తున్న బ్యాంకులు

ఫ ఏటీఎంల వద్ద నోక్యాష్‌ బోర్డులు

ఫ డిజిటల్‌ చెల్లింపులు చేయాలంటున్న అధికారులు

ఫ నగదు కోసం వృద్ధులు, మహిళల ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement