భువనగిరి: డ్రిప్, స్ప్రింక్లర్లు వినియోగించడం ద్వారా పంటలను ఎల్‌నినో ప్రభావం నుంచి కాపాడుకోవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత సూచించారు. బుధవారం భువనగిరి మండలంలోని చీమలకొండూరు, జమ్మాపురం గ్రామాల్లో పత్తి చేలను పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావం నుంచి పంటలను కాపాడుకోవడానికి అనుసరిస్తున్న ప్రత్యామ్నాయ విధానాలను అడిగి తెలుసుకున్నారు. నీటి వసతి ఉన్న రైతులు ఈ విధానం అనుసరించడం ద్వారా పంటను పరిక్షించుకోవచ్చన్నారు. అనంతరం మునగ తోటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంటల సంరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ, ఉద్వానశాఖ శాస్త్రవేత్త స్వాతి, గ్రామ సర్పంచ్ లూర్థయ్య, అంజయ్య, రైతులు మధు, నవీన్, నర్సయ్య, బాలస్వామి, చిన్నయ్య, ఏఈఓ సంధ్య పాల్గొన్నారు


