ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

భూదాన్‌పోచంపల్లి : అభివృద్ధిలో పోచంపల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం పోచంపల్లి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛ ఎలక్ట్రిక్‌ వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో హెచ్‌ఎండీఏ నిధులతో చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. టెండర్లు పూర్తయిన సీసీ రోడ్లు, అంతర్గత డ్రెయినేజీ పనులను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. తదుపరి ఎండీపీఓ కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పర్యాటక కేంద్రమైన పోచంపల్లికి అదనపు బస్సు సర్వీసులను నడిపించాలని ఆర్టీసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పోచంపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత లవకుమార్‌, డైరెక్టర్‌లకు శాలువా కప్పి సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, పింఛన్‌ ఇప్పించాలని కోరుతూ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ తడక వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ అంజన్‌రెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ కొయ్యడ రజిని శ్రీనివాస్‌, అర్బన్‌బ్యాంకు చైర్మన్‌ తడక రమేశ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పునూతుల వెంకటేశ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు కళ్లెం రాఘవరెడ్డి, పాక మల్లేశ్‌, మర్రి నర్సింహారెడ్డి, కాసుల అంజయ్య, సామ మోహన్‌రెడ్డి, కొట్టం కరుణాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement