యాదగిరిగుట్ట రూరల్: రైతులు ఆయిల్ పామ్‌తో అధిక లాభాలు పొందవచ్చని ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫెడ్ సమన్వయంతో యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలో గల రైతు వేదికలో శుక్రవారం ఆయిల్ పామ్ పంటలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించాలన్నారు. యాదగిరిగుట్ట ఉద్యానవన శాఖ అధికారి స్నేహిత, ఏఈఓ లావణ్య, ఎఫ్‌ఓ సోహైల్, హరీష్ పాల్గొన్నారు.
లక్ష్మీనారసింహుడికి
లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. శుక్రవారం ఏకాదశి కావడంతో ఆలయాన్ని వేకువజామునే తెరిచి స్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ జరిపించారు. అనంతరం గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం చేపట్టి, ఆరాధన, బాలబోగం వంటి పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన పూజ చేపట్టారు. అదేవిధంగా ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు.
ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి
అదనపు బాధ్యతలు
భువనగిరిటౌన్ : జిల్లా యువజన క్రీడల శాఖ అదనపు బాధ్యతలను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జినుకల శ్యామ్‌సుందర్ శుక్రవారం స్వీకరించారు. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు యువజన క్రీడల శాఖ అధికారిగా పనిచేసిన ధనుంజయ్ బదిలీ కావడంతో, తొలుత ఆ బాధ్యతలను జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్‌కు అప్పగించారు. ఇటీవల జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు పదవీ విరమణ పొందడంతో సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలను కూడా డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్‌కే కేటాయించారు. ఒకే అధికారిపై పనిభారం పెరగడంతో, కలెక్టర్ స్పందించి శ్రీనివాస్ వద్ద ఉన్న యువజన క్రీడల శాఖ బాధ్యతలను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్‌సుందర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి జేవీవీ కృషి ప్రశంసనీయం
భువనగిరి: శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి జేవీవీ చేసిన కృషి ప్రశంసనీయమని డీఈఓ భిక్షపతి అన్నారు. జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డీఈఓ కార్యాలయంలో శ్రీనేను ఆడపిల్లనుశ్రీ అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర జ్ఞానం ద్వారా మూఢ విశ్వాసాలు, అశాసీ్త్రయ భావాలను ఎండగట్టడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలను అన్వేషించడంలో జేవీవీ కృషి ఉందన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణారెడ్డి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు అమరేందర్, జీసీడీఓ రాధ, సెక్టోరియల్ ఆఫీసర్ నాగిరెడ్డి శ్రీహరిఅయ్యంగార్, నాయకులు పాల్గొన్నారు.


