కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలి | - | Sakshi
Sakshi News home page

కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలి

Jul 11 2026 6:49 AM | Updated on Jul 11 2026 6:49 AM

సాక్షి, యాదాద్రి : మాజీ సీఎం కేసీఆర్‌కు పేరు వస్తుందన్న ఈర్ష్యతోనే సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం నీటిని తెలంగాణ ప్రజలకు ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. కన్నేపల్లి రిజర్వాయర్‌ నుంచి కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతికి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. కన్నెపల్లి పంప్‌ హౌస్‌ నుంచి రోజుకు మూడు టీఎంసీల నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా రేవంత్‌ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. మేడిగడ్డ వద్ద ఒక్క పిల్లర్‌ కుంగిపోతే బాగు చేయడానికి రెండున్నరేండ్లు సరిపోలేదా అని ప్రశ్నించారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ మాట్లాడుతూ బస్వాపూర్‌, గంధమల్లకు నీళ్లిస్తే ఇక్కడి ప్రజలు బాగుపడతారన్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం సాకులు చెబుతూ గోదావరి జలాలను ఎత్తిపోయకుండా రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్‌ భువనగిరి లోక్‌సభ ఇన్‌చార్జ్‌ క్యామ మల్లేష్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కొలుపుల అమరేందర్‌, రామచంద్రారెడ్డి, నరేందర్‌రెడ్డి, తుంగబాలు, ఏవి.కిరణ్‌, శ్రీనివాస్‌రెడ్డి, పద్మ పాల్గొన్నారు.

ఫ కలెక్టరేట్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నాయకుల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement