పిల్లలను చిత్రహింసలకు గురిచేసిన తల్లిదండ్రులపై కేసు | - | Sakshi
Sakshi News home page

పిల్లలను చిత్రహింసలకు గురిచేసిన తల్లిదండ్రులపై కేసు

Jul 10 2026 9:45 AM | Updated on Jul 10 2026 9:45 AM

హుజూర్‌నగర్‌ : తమ స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నారని పిల్ల లను చిత్రహింసలకు గురిచేసిన తల్లిదండ్రులపై హుజూర్‌నగర్‌ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నకిరేకంటి రవికి 24 ఏళ్ల క్రితం శైలజతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పదేళ్ల క్రితం రవి, శైలజ విడిపోయారు. ఆ తర్వాత శైలజ వేరే వ్యక్తిని వివాహమాడింది. నాలుగేళ్ల క్రితం రవి.. ఇందు అలియాస్‌ అఖిలను రెండో పెళ్లి చేసుకున్నాడు. అఖిలకు కూడా అప్పటికే వివాహం జరగగా.. ఆమెకు ధనుష్‌(5) అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత రవి, అఖిలకు కుమారుడు హేమంత్‌(2) పుట్టాడు. ప్రస్తుతం రవి, అఖిల దంపతులు పిల్లలు హేమంత్‌, ధనుష్‌తో కలిసి హుజూర్‌నగర్‌ పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపులో నివాసముంటున్నారు. రవి లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. అఖిల కూలీ పనికి వెళ్తుంది. వీరిద్దరి స్వేచ్ఛకు పిల్లలు అడ్డుగా ఉన్నారనే ఉద్దేశంతో వారిని విపరీతంగా కొట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ నరేష్‌ చిన్నారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఐసీడీఎస్‌ సెక్టార్‌ సూపర్‌వైజర్‌ నిర్మల ఫిర్యాదు మేరకు రవి, అఖిల దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఇద్దరు చిన్నారులను సూర్యాపేటలోని ప్రభుత్వ బాలల సురక్షా కేంద్రానికి తరలించారు.

బాలల సురక్షా కేంద్రానికి చిన్నారుల తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement