ఉరేసుకుని యువకుడి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని యువకుడి బలవన్మరణం

Jul 10 2026 9:45 AM | Updated on Jul 10 2026 9:45 AM

చౌటుప్పల్‌ : ఒంటరి జీవితంపై విరక్తితో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామంలో గురువారం వెలుగుచూసింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన చింతల రాజశేఖర్‌రెడ్డి(35) తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే మృతిచెందారు. రాజశేఖర్‌రెడ్డి ఒక సోదరుడు ఉండగా.. అతడు తన కుటుంబంతో కలిసి చౌటుప్పల్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. రాజశేఖర్‌రెడ్డి ఒక్కడే గ్రామంలో ఒంటరిగా ఉంటూ డ్రైవర్‌గా పనిచేసస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజులుగా అతడు కనిపించకపోవడం, ఇంటి తలుపులు లోపలి నుంచి పెట్టి ఉండడంతో చుట్టుపక్కల వారు గురువారం ఉదయం ఇంట్లోకి వెళ్లి చూడగా.. గదిలో ఇంటి పైకప్పుకు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒంటరిగా జీవిస్తుండడంతో పాటు వివాహం జరగకపోవడంతో మవస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. మృతుడి బావ గంగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement