భువనగిరి: భూభారతి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలలో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. వారం రోజుల క్రితమే మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ, సర్వర్‌లో తలెత్తిన లోపాల కారణంగా రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దీంతో ప్రతిరోజూ క్రయవిక్రయదారులు తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చి, సాయంత్రం వరకు ఎదురుచూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రతి పది నిమిషాలకు ఒకసారి కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు వెళ్లి ఆరా తీయడం.. సర్వర్ రావడం లేదని ఆయన చెప్పడం నిత్యకృత్యంగా మారింది.
ఉదయం.. సాయంత్రం కొద్దిగా పనిచేసి..
గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూభారతిని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల రాష్ట్రస్థాయిలో భూభారతి సర్వర్‌ను అప్‌డేట్ చేసినప్పటి నుంచి ఈ సాంకేతిక సమస్యలు మొదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా 17 తహసీల్దార్ కార్యాలయాలు ఉన్నాయి. సర్వర్ల సమస్య కారణంగా 510 భూ క్రయవిక్రయ దరఖాస్తులు పెండింగ్‌లో పడినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సర్వర్ ఉదయం 10లోపు, తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే కొద్దిగా పనిచేస్తోందని క్రయవిక్రయదారులు చెబుతున్నారు.మీ సేవలో స్లాట్ బుకింగ్‌చేసుకున్న క్రయవిక్రయ దారులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కోసం పడిగాపులు కాస్తున్నారు.
సర్వర్ పనిచేయక భువనగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఖాళీగా కూర్చున్న అధికారి
భువనగిరి తహీల్దార్ కార్యాలయం వద్దపడిగాపులు కాస్తున్న రైతులు
ఫ తహసీల్దార్ కార్యాలయాల్లో
నిలిచిన రిజిస్ట్రేషన్లు
ఫ వారం రోజులుగా సాంకేతిక సమస్య
ఫ క్రయవిక్రయదారుల పడిగాపులు
ఫ 510 దరఖాస్తులు పెండింగ్


