నెలాఖరులోగా లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు

Apr 9 2026 8:35 AM | Updated on Apr 9 2026 8:35 AM

అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

యాదగిరిగుట్ట రూరల్‌: నెలాఖరులోగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు సూచించారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఏయే పనులు పెండింగ్‌లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌, నీటి సరఫరాతో పాటుగా, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ బెడ్‌ రూమ్‌లతో పాటు చుట్టు పక్కన మిగిలి ఉన్న భూమిని సర్వే చేయించి ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ డీఈ శ్రీనివాస్‌, పంచాయతీరాజ్‌ ఏఈ పూర్ణ చందర్‌, ఎంపీడీఓ నవీన్‌కుమార్‌, గ్రామ పాలకవర్గ సభ్యులు వగ్గు రాణా ప్రతాప్‌, చిన్నం మల్లయ్య, కానుగు రాజీవ్‌, కాల్నె వినోద్‌ పాల్గొన్నారు.

సురక్షిత మాతృత్వమే లక్ష్యం

సాక్షి, యాదాద్రి : సురక్షిత మాతృత్వమే లక్ష్యమని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు పేర్కొన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లో సేఫ్‌ మదర్‌ హుడ్‌ (సురక్షిత మాతృత్వం)పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రతి గర్భిణికి సురక్షిత ప్రసవం జరిగేలా పక్కా కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు అయ్యేలా కృషి చేయాలని కోరారు.ఈ సదస్సులో డీఎంహెచ్‌ఓ మనోహర్‌, డీసీహెచ్‌ఎస్‌ చిన్న నాయక్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ యశోద, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement