మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు సౌత్ ఇండియా బెస్ట్ టీచ
గరిడేపల్లి: సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రసన్నకుమారి సౌత్ ఇండియా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, నాణ్యమైన విద్య, క్రమశిక్షణతో కూడిన విద్యా నిర్వహణలో ప్రసన్నకుమారి అందించిన సేవలను గుర్తించి గురుచైతన్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమెను విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.


