సరిచేస్తారా.. సరిపెడతారా..
ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తా – మున్సిపల్ కమిషనర్
ఆలేరు: మున్సిపాలిటీలోని ఓటర్లను చెల్లాచెదురు చేశారు.. ఒకే కుటుంబానికి చెందినవారిని వేర్వేరు వార్డుల్లో నమోదు చేశారు.. తప్పులను సరిదిద్దిన తరువాతే తుది జాబితా ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా అభ్యంతరాలపై ఆలేరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశం గరంగరంగా సాగింది. అడ్డగోలుగా ఓటరు జాబితా తయారు చేశారని నాయకులు అధికారులపై మండిపడ్డారు.మున్సిపల్ కార్యాలయం ఎదుట ౖబైఠాయించి ఆందోళన చేశారు.
అఖిలపక్షం అభ్యంతరాలు ఇవీ..
12వ వార్డు ఓటర్లతో 10వ వార్డుగా, 9వ వార్డు ఓట్లతో 12వ వార్డుగా ఏర్పాటు చేయడాన్ని నాయకులు తప్పబట్టారు. 6వ వార్డులోకి సమీప కాలనీ ఓట్లను కాకుండా వేరే వార్డు ఓట్లను కలపి ఓటర్ల సంఖ్య పెంచడంపై అఖిలపక్ష నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక వార్డులో అధికంగా, ఒక వార్డులో తక్కువగా మొత్తం 12 వార్డులతో కూడిన జాబితాను తప్పులతడకగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారపార్టీకి అనుకూలం చేకూరేలా అధికారులు వార్డుల ఓటర్ల విభజన ఇష్టారీతిగా చేశారని ఆరోపించారు.
పాత వార్డుల ప్రకారంగా
జాబితా తయారు చేయాలి
నాలుగో వార్డులో గుర్తు తెలియని వ్యక్తుల పేర్లు జాబితాలో ఉన్నాయని నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇతర ప్రాంతాలతో పాటు మృతిచెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం, అన్ని వార్డుల్లో ఓటర్లు సమానంగా, పాత వార్డుల ప్రకారం జాబితాను తిరిగి రూపొందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, అఖిలపక్ష నాయకులు పుట్ట మల్లేశ్, తునికి దశరథ, బేతి రాములు, సృజన్‌కుమార్, ఎలుగల వెంకటేష్, ఎక్బాల్,గొట్టిపాముల రాజు, మొరిగాడి శ్రీశైలం, కుండె సంపత్, రమేష్, సాంబిరెడ్డి, బోగ సంతోష్, శంకర్, భాస్కర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ముసాయిదా ఓటరు జాబితాపై అఖిలపక్షం గరంగరం
ఫ సవరించాలని ఆలేరులో నాయకుల ఆందోళన
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు 2025 అక్టోబర్ 1వ తేదీ నాటి వివరాల ఆధారంగా, ఇంటి నంబర్ల ప్రకారం ముసాయిదా ఓటరు జాబితా తయారు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. మున్సిపాలిటీ నుంచి సాయిగూడెం విడిపోవడం వల్ల వార్డుల ఓటర్ల విభజనలో తేడాకు కారణమని, అభ్యంతరాలపై ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. తమ పరిధిలో ఉన్న వాటిని పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.
సరిచేస్తారా.. సరిపెడతారా..


