అధ్యయనోత్సవాలు పరిసమాప్తం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆరు రోజుల పాటు కొనసాగిన అధ్యయనోత్సవాలు ఆదివారం పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా ముగిశాయి. చివరి రోజు శ్రీస్వామిని శ్రీలక్ష్మీనరసింహుడిగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ అద్దాల మండపంలో శ్రీస్వామిని అధిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. అధ్యయనోత్సవాలకు వచ్చిన దివ్య ప్రబంధ పారాయణీకులను ఆలయాధికారులు ఘనంగా సన్మానించారు. అంతకు ముందు అలయంలో నిత్య ఆరాధనలు నిర్వహించి, పారాయణీకులచే ప్రబంధ పారాయణం జరిపించారు. శ్రీస్వామి వారి ఆలయంలో ఉత్సవమూర్తులకు తిరుమంజన, నవకలశ స్నపన మహోత్సవం చేపట్టారు. అధ్యనోత్సవాలు ముగిసిన నేపథ్యంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.
చివరి రోజు శ్రీలక్ష్మీనరసింహుడిగా అలంకరణ
నేటి నుంచి నిత్య, శాశ్వత కల్యాణం,
సుదర్శన హోమం ప్రారంభం


